Share News

వేములవాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:34 AM

వేములవాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

వేములవాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం

వేములవాడ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): వేములవాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. పట్టణంలోని మల్లారం రోడ్డు చౌరస్తా నుంచి బతుకమ్మ తెప్ప మీదుగా జగిత్యాల బస్‌స్టాండు వరకు 2.60 కోట్లతో నూతన డివైడర్‌, సెంటర్‌ లైటింగ్‌ నిర్మాణానికి ప్రభుత్వ విప్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వేముల వాడ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పట్ట ణంలో 146 కొత్త పోల్స్‌ వేసుకుంటూ 3.6కిలోమీటర్ల మేర నూతన సెం ట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణాభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి రూ.15కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కోటి రూపాయలతో తిప్పాపూర్‌ బస్టాండు జంక్షన్‌ అభివృద్ధి చేస్తున్నా మని తెలిపారు. గతంలో పట్టణ వ్యాప్తంగా నాటిన కొనోకార్ఫాస్‌ మొక్క లు తొలగించి నూతన మొక్కలను నాటనున్నట్లు వివరించారు. మూడో బ్రిడ్జి నిర్మాణంతో పాటు ప్రతి వార్డులో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని, ప్రజలు కోరిన చోట సీసీరోడ్డు నిర్మా ణం జరిగేలా చూస్తామన్నారు. పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సోమవారం లక్షమంది భక్తులు మెక్కులు చెల్లించుకున్నారని తెలి పారు. మరోరెండు సంవత్సరాల్లో వేములవాడ రూపురేఖలు మార నున్నాయన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరి ష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. నాంపల్లి గుట్టపై రోప్‌వే, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణ ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటున్నానని, రాబోవు మున్సిపల్‌ ఎ న్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, వైస్‌ చైర్మన్‌ కనికరపు రాకేష్‌ నాయకులు పుల్కం రాజు, సంద్ర గిరి శ్రీనివాస్‌, ఇప్పపూల అజయ్‌, గూడూరి మధు, కొక్కుల రాజు, ప త సత్యలక్ష్మి, తోట లహరి, సాగరం వెంకటస్వామి, అంబటి చంద్రశేఖర్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.

ముగ్గులు సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం

సంక్రాంతికి మహిళలు, యువతులు ఇళ్ల ముందు వేసే ముగ్గుల కు ఎంతో విశిష్టత ఉందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో ముగ్గు ఒక భాగమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్ట ణంలోని వాసవి కల్యాణ మండపంలో అల్ఫోర్స్‌ విద్యాసంస్థలు, మై వేములవాడ ట్రస్ట్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను అందజేశా రు. ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ వీ నరేందర్‌రెడ్డి, రాజన్న ఆలయ ఈవో రమాదేవి తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 12:34 AM