రైతుల కల సాకారం చేస్తాం..
ABN , Publish Date - May 03 , 2026 | 12:12 AM
మర్రిపల్లి రిజ ర్వాయర్ పనులను పూర్తిచేసి దశాబ్దాల రైతుల కలను సాకా రం చేస్తామని ప్రభు త్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ రూరల్, మే 2 (ఆంధ్రజ్యోతి): మర్రిపల్లి రిజ ర్వాయర్ పనులను పూర్తిచేసి దశాబ్దాల రైతుల కలను సాకా రం చేస్తామని ప్రభు త్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మర్రిపల్లి గ్రామంలోని రిజర్వా యర్ పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగర్వా ల్‌తో కలిసి శనివారం ఆయన సందర్శించారు. రిజర్వాయర్ వద్ద అలుగు అడుగుభాగం, ఎడమ, కుడికాలువ తూము వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనం తరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గానికి సాగు నీటిని తీసుకురావ డానికి రుద్రంగి కలికోట సూరమ్మ ప్రాజెక్టు వరకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి 1730కోట్లు మంజూరు చేశారన్నారు. గత ప్రభుత్వహయాంలో ప్రాజెక్టుపనులను ప్రారం భించాలని ప్రతిపక్షనేతగా తాను మండల నాయకులతో, రైతులతో కలిసి పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పు కార్యక్ర మాలు చేపట్టినా పనులు ప్రారంభం కాలేద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టుపనులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కట్టవెడల్పును అనూహ్య రీతిలో పెంచామన్నారు. ఎడమకాలువ, కుడి కాలువ తూము పనులను దాదాపు పూర్తి చేశా మన్నారు. మర్రిపల్లి ప్రాజెక్టును పూర్తి చేసుకుని నీటిని నింపుకోవడం ద్వారా దాదాపు 3,600 ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. మర్రి పల్లి చెరువులో నీటిని నింపుకోవడం ద్వారా మర్రిపల్లితోపాటు, మల్లారం, కోనాయిపల్లి, నాగాయపల్లి, పోశెట్టిపల్లి, హన్మక్కపల్లి, చెక్క పల్లి, ఎదురుగట్ల, కాశాయపల్లి, అచ్చన్నపల్లి, వెంకటాంపల్లి, బాలరాజుపల్లి గ్రామాల్లో భూగ ర్భజలాలు పెరుగుతాయన్నారు. నష్టపరి హారం కోసం 5కోట్లరూపాయల నిధులు ఉన్నా యని, ప్రాజెక్టు పూర్తిచేసేందుకు అవసరమైన మరిన్ని నిధులు తీసుకువచ్చేం దుకు సిద్ధంగా ఉన్నామ న్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అను గుణంగా అభివృద్ధి పనులను చేపడుతు న్నామన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. చెక్కపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో అక్కడి రైతులు కంచు కుంటలోకి నీటిని విడుదల చేయాలని కోరారని, 12 సంవత్సరాల తర్వాత కంచుకుంటలోకి నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామ న్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమ పాలన నడు స్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మెన్ రొండి రాజు, వేములవాడ ఆర్డీవో రాధాబాయ్, రూరల్ తహశీల్దార్ అబూబాకర్, పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.