రుద్రంగిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:29 AM
రుద్రంగిని మో డల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
రుద్రంగి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రుద్రంగిని మో డల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రుద్రంగి మండల కేంద్రంలో సర్వ శిక్ష నిధులతో మండల రిసోర్స్ భవనం(ఎంఆర్సీ) నిర్మించగా, శుక్రవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ భవనం ఆవరణలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రుద్రంగిలో పలు ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్ భవనాన్ని త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. స్థానికుల కోరిక మేరకు క్రీడల కోసం మైదానం ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలోని యువత, విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి, ఉపాధి పొందేందుకు శిక్షణ అందించే అడ్వాన్స్ టెక్నాలజీ సెంట ర్ కోసం రూ.42 కోట్లు మంజూరు చేసిందని, టెండర్లు పూర్తి అయ్యాయని త్వరలోనే పనులు మొదలు పెడుతా మని తెలిపారు. టాటా కంపెనీ సహకారం, భాగస్వా మ్యంతో దీనిలో మొత్తం ఆరు కోర్సులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణానికి స్థలం గుర్తిసున్నామని, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వేములవాడ నియోజకవర్గం లో రుద్రంగి రెండో అతిపెద్ద గ్రామమని తెలిపారు. విశా లమైన రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్నారని తెలిపారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు త్వరలో పరిహారం పంపిణీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వ అభివృద్ధి పనులకు వినియోగిస్తామని, ఎల్లం పల్లి ప్రాజెక్ట్ నుంచి నియోజకవర్గానికి త్వరలోనే సాగు నీటిని విడుదల చేయిస్తానని తెలిపారు. 132/33 సబ్ స్టేషన్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, విద్యుత్ సమస్యలు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. రుద్రం గి నుంచి దసరా నాయక్ తండా అప్రోచ్ సీసీ రోడ్డు హై లెవల్ బ్రిడ్జి 2.50కోట్లుతో రోడ్డుకు నిధులు మంజూర య్యాయని, పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని వివరించారు. రైతులు అంగీకరిస్తే వా రికి నష్టపరిహారం చెల్లించి అచ్చయ్య కుంటలో, నగరాం చెరువును నీటితో నింపుతామని స్పష్టం చేసారు.
భవనంతో సమావేశాలకు ఉపయోగం..
రుద్రంగిలో మండల రిసోర్స్ భవ నం(ఎంఆర్సీ) అందుబాటులోకి రావ డంతో విద్యాభివృద్ధి సమావేశాలకు ఉపయోగంగా ఉంటుందని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించవచ్చన్నారు. వివి ధ ప్రభుత్వ కార్యాలయ భవనాల కోసం ఇంటిగ్రేటెడ్ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం అన్ని వస తులు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, డీఈవో వినోద్ కుమార్, టీజీ ఈ డబ్ల్యూ ఐడీసీఈఈ అశోక్ కుమార్, డీఈ సత్యనారా యణ, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్, గట్ల మీనయ్య, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, తది తరులు పాల్గొన్నారు.