Share News

వేములవాడ మున్సిపల్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తాం

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:16 AM

వేములవాడ మున్సిపల్‌ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రత్యేకంగా కృషి చేశా రని, మున్సిపల్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని ప్రభుత్వవిప్‌ ఆది శ్రీని వాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

వేములవాడ మున్సిపల్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తాం

వేములవాడ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): వేములవాడ మున్సిపల్‌ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రత్యేకంగా కృషి చేశా రని, మున్సిపల్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని ప్రభుత్వవిప్‌ ఆది శ్రీని వాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో కాం గ్రెస్‌ ముఖ్యనాయకులు, మున్సిపల్‌ ఎన్నికల కాంగ్రెస్‌ అభ్యర్థులతో కలిసి సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేస్తూ ఎన్నికల్లో ఓట్లను అభ్యర్థించండంలో సఫలమయ్యామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థు లకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. రాను న్నరోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపుని చ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డులలో తిరిగినప్పుడు ప్రజలు కాలనీలోని సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని గుర్తుచేశారు. గత పాల కులు పట్టణంలో ప్రతి వార్డులోని సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించా రు. వార్డులో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కష్టపడి పని చేస్తే ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఫెవికల్‌ బంధంతో కాంగ్రెస్‌ పార్టీపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిం చారు. మున్సిపల్‌లో ఓడిపోతున్నామని తెలిసి గిచ్చి కయ్యానికి కాలు దువ్వారని అన్నారు. రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు గమనించారని వివరించారు. గత పాలకులు ఎమ్మెల్యే పదవిని హోదా గా వాడుకుంటే తాను మాత్రం అభివృద్ధే మంత్రంగా ముందుకు సాగుతున్నాని తెలిపారు. అభివృద్ధి పనులను చూసి పట్టణ ప్రజలు మన వెంట నడిచారని ప్రతిఒక్కరు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆదేశించారు. ప్రచార సమ యంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు అయ్యేలా చూడాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు నాయకులు సంద్రగిరి శ్రీని వాస్‌, పుల్కం రాజు, సాగరం వెంకటస్వామి, సిర్రం శిరీష, ఇప్పపూల మమత, బింగి మహేష్‌, కాశ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 12:16 AM