Share News

నేరెళ్ల బాధితుల పక్షాన పోరాడుతాం..

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:48 PM

నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకూ ప్రశ్నిస్తాం, పోరాటం, పరిష్కారం జరిగే వరకు అండగా ఉంటామని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

నేరెళ్ల బాధితుల పక్షాన పోరాడుతాం..

సిరిసిల్ల/తంగళ్లపల్లి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకూ ప్రశ్నిస్తాం, పోరాటం, పరిష్కారం జరిగే వరకు అండగా ఉంటామని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో 2017లో ఇసుక లారీ ఢీకొని భూమయ్య అనే వ్యక్తి చనిపోయిన సంఘటనలో గ్రామస్తులు లారీని తగలబెట్టారు. ఈ సంఘటనపై పోలీసు లు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్టు చేసి పోలీ స్‌ చర్యకు గురిచేశారు. బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్‌ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. మంగళవారం టీఆర్‌ ఎస్‌ అధ్యక్షురాలు కవిత బాధిత గోపాల్‌ కుటుంబంతో పాటు ఇతర బాధితులు కోల హరీష్‌, పెంట బానయ్య కుటుంబాల ను పరామర్శించి భరోసా కల్పించారు. కంటతడి పెట్టిన కు టుంబాలను ఓదార్చారు. పలువురు వినతిపత్రాలు అందించా రు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నేరెళ్ల ప్రాంతం నెత్తురుతో తడవలేదా.. మనందరం మానవత్వం మరిచిపో యామా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేరెళ్ల దాష్టీకానికి పాల్పడిన పోలీసులకు శిక్షపడాలని, అప్పుడు మాత్రమే పోలీ సులకు భయం ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో నేరెళ్లలో జరిగిన దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన, అప్పుడు పాలించిన కుటుంబంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటూ క్షమాపణ అడుగుతున్నానని అన్నారు. తమ రాజ్యం వస్తే న్యాయం చేస్తానని చెప్పడానికి రాలేదని ఈ రాజ్యం మెడలు వంచి నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తానని చెప్పడానికి వచ్చానని, ఏదో ఒక రోజు మా రాజ్యం వస్తుందని ఇలాంటి సంఘటనలు జరగవని అన్నారు. ప్రజలు బాధలో ఉంటే ఆదుకోని ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. నేరెళ్లకు టూరిస్ట్‌ల వచ్చిపోతూ ఓట్లు వేసుకొని వెళ్లడమే చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఎగ్జిబిషన్‌లాగా అందరిని తీసుకొచ్చి వెళ్లాడని ఇంతవరకు ప్రతిఫలం మాత్రం కనిపించలేదన్నారు. నేరెళ్ల ఘటనకు పాల్పడిన పోలీసులు, ధనదాహంతో ప్రాణాలు తీసిన బడా బాబులకు ఎందుకు శిక్షలు పడలేదన్నారు. తాను ఏదో టూరి స్టులా వచ్చి పరామర్శించినట్లు కాకుండా వారికి న్యాయం జరిగే వరకూ పోరాడుతానన్నారు. ఢిల్లీ వరకు వెళ్లి అక్కడే ఆగిపోయిన ఎస్సీ కమిషన్‌ రిపోర్ట్‌ కూడా తీసుకొస్తానని, అవసరమైతే ముఖ్యమంత్రి, అసెంబ్లీ ఎదుట బైఠాయించి నేరెళ్ల బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నా రు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూపాయి అం దలేదని, కుటుంబానికి రూ కోటి పరిహారం ఇవ్వాలని, ఈ సంఘటనపై రాజకీయాలు మాని అన్ని పార్టీలు మానవ త్వంతో బాధితులను ఆదుకోవాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ రిపోర్ట్‌ తెప్పించాలన్నారు. తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుడతాయని, అందరం కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నామని, నేరెళ్ల సంఘటన జరిగినప్పుడు ఉన్న ప్రభుత్వంలోని కుటుంబంలో తాను కూడా సభ్యురాలుగా ఉన్నందుకే సిగ్గుతో తలదించుకుంటూ అందరినీ క్షమాపణ అడుగుతున్నానన్నారు. కొందరి ధన దాహం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయాలా చేశారని, ఇసుక లారీల కార ణంగా ఒకబిడ్డ ప్రాణం పోతే ఇక్కడి ప్రజలు ఆందోళన చేస్తే వాళ్లపై పోలీసులు దాష్టీకం చేశారని, ఐదు రోజుల పాటు 8 మందిని ఇష్టానుసారంగా కొట్టారన్నారు. జైలర్‌ కూడా వాళ్ల ను జైల్లోకి తీసుకోలేమని చెప్పారని గుర్తుచేశారు. దాష్టీకానికి పాల్పడిన ఒక్క పోలీసుకైనా శిక్ష పడిందా అని రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌, కేటీఆర్‌లను ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ ఏం చేస్తున్నాడని, బండి సంజ య్‌కి ఏమైందన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ను తీసుకొచ్చారని, కానీ ఇప్పటికీ కూడా రిపోర్ట్‌ రాలేద ని, ఏమైందో బండి సంజయ్‌ చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ రిపోర్ట్‌ తెప్పించాలన్నారు. కచ్చితంగా ఎస్సీ కమిషన్‌ రిపోర్ట్‌ కోసం పోరాటం చేస్తామని, అవసరమైతే నెరేళ్ల బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తామన్నారు. ఎన్నికలకు ముందు నేరెళ్ల బా ధితుల పేరు చెప్పుకొని రేవంత్‌రెడ్డి ఓట్లు వేయిం చుకున్నాడని, నేరెళ్ల బాధితుల పేరు ఎత్త లేదని, ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా అని విమర్శిం చారు. నేరెళ్ల బాధితులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, నేరెళ్ల దమనకాండకు పాల్పడిన వాళ్లపై అందరం కలిసి పో రాటం చేద్దామని, ఈ విషయంలో రాజకీయం వద్దన్నారు. గత ప్రభుత్వంలోనూ, ఇప్పటి ప్రభుత్వంలోనూ ప్రశ్నించే వాళ్లపై దాష్టీకానికి పాల్పడుతున్నారన్నారు.పొన్నం ప్రభాకర్‌, భట్టి, అడ్లూరి లక్ష్మణ్‌లను మానవత్వం ఏమైందని, మీరా కుమార్‌నీ తీసుకొ చ్చి న్యాయం చేస్తామని మాట ఇచ్చారని ఏమైందన్నారు. బాధితుల కన్నీళ్ల పునాదుల మీద అధికారం అనుభవించటం లేదా అని ఆరోపించారు. చనిపోయిన గోపా ల్‌ కుటుంబం హాస్పిటల్‌ చుట్టూ తిరిగినా ప్రభుత్వ నుంచి సహాయం అందలేదన్నారు. ఎమ్మెల్యే కేటీఆర్‌ బాధిత కుటుం బాలకు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్‌, కరీం నగర్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి నాగరాజు, నాయకులు రూప్‌ సింగ్‌, సుమలత శర్మ, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి మజీద్‌, శైలజా, పవన్‌, రంజిత్‌, ఆనంద్‌, ప్రవీణ్‌, మానకొండూరు నియోజకవర్గం ఇన్‌చార్జి చైతన్య, మాజీ వైస్‌ఎంపీపీ భాస్కర్‌, జావిద్‌, మార్వాడి దేవరాజు, బైరి రాజేష్‌, అశోక్‌, భూపతి, రాజిరెడ్డి, రమావత్‌ మోహన్‌, రేణుక, మంగ, లాస్య, సంధ్య, వీర్నపల్లి ఇన్‌చార్జి బండి శ్రీహరి, వేములవాడ ఇన్‌చార్జి తోట కనకయ్య, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 11:48 PM