Share News

ముంపు బాధితులకు న్యాయం చేస్తాం

ABN , Publish Date - Jul 24 , 2026 | 11:55 PM

నారాయణపూర్‌ రిజర్వాయర్‌ ముంపు బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా భూసేకరణ ప్రత్యేకాధికారి బండి రాజేశ్వరి అన్నారు.

ముంపు బాధితులకు న్యాయం చేస్తాం
నారాయణపూర్‌లో ముంపు ఇళ్లను పరిశీలిస్తున్న ఎస్‌డీసీ రాజేశ్వరి

గంగాధర, జూలై 24 (ఆంధ్రజ్యోతి): నారాయణపూర్‌ రిజర్వాయర్‌ ముంపు బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా భూసేకరణ ప్రత్యేకాధికారి బండి రాజేశ్వరి అన్నారు. ముంపు బాధితుల సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వరుస కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు. కలెక్టర్‌ ఆదేశాలతో శుక్రవారం భూసేకరణ అధికారి బండి రాజేశ్వరి నారాయణపూర్‌ గ్రామంలో పర్యటించారు. కట్ట వెడల్పులో ఎన్ని ఇళ్లకు ప్రమాదం ఉందని పరిశీలించారు. అనంతరం రిజర్వాయర్‌ కట్టపైన బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాన్ని మొత్తం ముంపు కింద ప్రకటించి న్యాయం చేయాలని కోరా రు. వరదలకు చెరువు నిండితే కట్టుబట్టలతో చెరువు కట్ట ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నామని వివరించారు. కట్ట ఎత్తు , వెడల్పు చేయవద్దని అధికారులను కోరారు. ముంపు గ్రామంగా ప్రకటించి రిజర్వాయర్‌ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అనంతరం భూసేకరణ ప్రత్యేకాధికారి రాజేశ్వరి మాట్లాడుతూ రిజర్వాయర్‌ ముంపు బాధితులు ఆందోళన చెద్దవద్దని సమస్యలను కలెక్టర్‌కు వివరించి న్యాయం చేయడానికి కృషి చేస్తామ న్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ దీకొండ బాబలక్ష్మి మధు, నీటిపారుదల శాఖ ఈఈ బాలక్రిష్ణ, తహసీల్దార్‌ అంబటి రజిత, ఇరిగేషన్‌ డీఈ,ఏఈ, సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్సై వంశీకృష్ణ, ఆర్‌ఐ సంతోష్‌కుమార్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 11:55 PM