వేములవాడను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:57 AM
వేములవాడను గొప్ప ఆధ్యా త్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, జనవరి 12(ఆంధ్రజ్యోతి): వేములవాడను గొప్ప ఆధ్యా త్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమ వారం రాత్రి భీమేశ్వరసదన్ వద్ద కళావేదికపై అయిదురోజులుగా నిర్వహిస్తున్న త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులను, పండితులను ప్రభుత్వ ఘ నంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలు అంతరించి పోకుండా వేములవాడ దేవస్థానంలో ప్రతి ఏటా త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న మాదిరిగా అతిపెద్ద దేవాలయమైన వేములవాడలోనూ కళలను ప్రోత్స హిస్తామన్నారు. సాంకేతిక, నిధుల పరంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఆలయ అభివృద్దిపై ఒక క్యాలెండర్ సిద్ధం చేయాలన్నారు. ఏ సమ యానికి ఏ పని పూర్తవుతుందో రూపకల్పన చేయాలన్నారు. అభివృద్ధి కళ్లకు కనబడే విధంగా ఆలయ రూపురేఖలను 15రోజులకు ఒకసారి బులెటిన్ విడు దల చేయాలనే ఆలోచన ఉందన్నారు. నూతన సాంకేతికతతో నిర్మాణాలు సాగు తున్నాయని, మరో 8మాసాల్లో పూర్తయ్యే విధంగా సిద్ధం చేస్తామన్నారు. ఈసం దర్భంగా ప్రభుత్వ విప్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, అధికారులు, కళాకారులు పాల్గొన్నారు.