మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:26 AM
రాబోయే రోజుల్లో కరీంనగర్ రూపురేఖలు మారడం ఖాయమని, అభివృద్ధిలో కరీంనగర్‌ను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.
కరీంనగర్ టౌన్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) రాబోయే రోజుల్లో కరీంనగర్ రూపురేఖలు మారడం ఖాయమని, అభివృద్ధిలో కరీంనగర్‌ను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. జ్యోతినగర్‌లో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రాన్ని ఒప్పించి యూసీఎఫ్ (అర్బన్ చాలెంజ్ ఫండ్) జాబితాలో కరీంనగర్‌ను చేర్పించానని, ఈ నిధులతో నగర రూపురేఖలు మారుతాయన్నారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి 80 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. నగరంలో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.