చలో హైదరాబాద్ నిర్వహించి తీరుతాం
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:49 AM
సమస్యల పరిష్కారానికి ఈనెల 10న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జరనల్ ఏలూరి శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు.
సుభాష్‌నగర్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి ఈనెల 10న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జరనల్ ఏలూరి శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్‌లోని టీఎన్‌జీవోస్ హాలులో ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దారం శ్రీనివాస్‌రెడ్డి, మడిపల్లి కాళీచరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు సంబందించి పెండింగ్‌లో ఉన్న సమస్యల గురించి మాట్లాడేందుకు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లగా రెండు సంవత్సరాలు ఆగాలని కోరారన్నారు. తాము రెండున్నర సంవత్సరాలు అగామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి, ఇప్పటి వరకు కమిటీని కూడా వేయలేదన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయడంలేదన్నారు. చలో హైదరాబాద్ సభ నిర్వహించుకునేందుకు అనుమతి అడిగితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఇవ్వలేదన్నారు. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. జేఏసీ రాష్ట్ర సెక్రెటరీ జరనల్ ఏలూరి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ తమకు న్యాయబద్ధంగా రావలసిన వాటి కోసమే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం, ప్రజల కోసం అదనంగా గంట పనిచేయమంటే చేస్తామని, ఉద్యోగుల హక్కులను కాలరాస్తామనే తీరు సరికాదన్నారు. సమావేశంలో లింగారెడ్డి, కటకం రమేశ్, స్థితప్రజ్ఞ, వెంకట్, సదానందం, శ్యామ్, దామోదర్‌రెడ్డి, సంగెం లక్ష్మణ్‌రావు, అరవింద్‌రెడ్డి, బొంకూరి శంకర్, కార్యదర్శి సందీప్, సిరిసిల్ల అధ్యక్షుడు ప్రవీణ్, కార్యదర్శి సుదర్శన్, నాగేందర్‌రెడ్డి, కార్యదర్శి అమరరేందర్‌రెడ్డి, ఉస్మాన్‌పాషా, కేశవరెడ్డి, పి తిరుపతిరావు, కరుణాకర్‌రెడ్డి, గోనే శ్రీనివాస్, జక్కుల వెంకటేష్, అశోక్‌రావు, నరహరి, రమేశ్, విజయ్‌చంద్రరెడ్డి, చంద్రమౌళి, ఆదర్శన్‌రెడ్డి, ఎస్ ప్రభాకర్‌రావు, చంద్రశేఖర్, సయ్యద్ జబీ, అశోక్, సత్యనారాయణ, శ్రీధర్, ముక్కెల కామేష్, రవినాయక్, శారద, సరిత, కిరణ్‌కుమార్‌రెడ్డి, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మిందర్‌సింగ్, రాజేశ్ భరద్వాజ్, రమేశ్, ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.