Share News

అడవుల్లో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపడుతాం

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:42 PM

అటవీ ప్రాంతాల్లో వృథాగా పోతున్న వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా వన్యప్రాణులతో పాటు ప్రజలకు నీటి భరోసా కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

అడవుల్లో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపడుతాం

కోనరావుపేట, రుద్రంగి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : అటవీ ప్రాంతాల్లో వృథాగా పోతున్న వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా వన్యప్రాణులతో పాటు ప్రజలకు నీటి భరోసా కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం మరిమడ్ల, అటవీ ప్రాంతాల్లో డీఎఫ్‌వో సత్యనారాయణ, ఎఫ్‌ఆర్‌వో మాధవి పర్యటించి సహజ నీటి వనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతేకాకుండా మరిమడ్ల అటవీప్రాంతంలోని జాలవాగు నుంచి గ్రామానికి తాగు నీరు అందించే అవకాశాలను పరిశీలించడంతో పాటు కొండ చెరువు, ఊర చెరువు, బోటిమే జలాలు తదితర ప్రాంతాల్లో నీటి లభ్యత, నిల్వ సామర్థ్యాన్ని అధికారులు, స్థానికులతో కలిసి పరిశీలించారు. అలాగే రుద్రంగి మం డల పరిధిలోని సీమర్లు, రెండు గట్ల వాగు, సూరమ్మ బుగ్గ కుంట, బుగ్గరాజు రాజేశ్వర చెక్‌ డాం పరిశీలించి దట్టమైన అటవీప్రాంతాల్లో పర్యటించారు. ఏడాది పొడ వునా సహజసిద్ధంగా నీరు ప్రవహించే వాగులు, వంక లు, జలవనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నీటి నిల్వ కు అనువైన ప్రాంతాలను పరిశీలించి, చేపట్టాల్సిన పను లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నీరు వృథాగా దిగువ ప్రాంతాలకు వెళ్లిపోకుండా అవసరమైన చోట చెక్‌డ్యామ్‌లు, చిన్న చెరువులు, కుంటలను నిర్మిం చడం, ఇప్పటికే ఉన్న నీటి నిల్వ నిర్మాణాలను పునరుద్ధ రించడం ద్వారా నీటిని నిల్వ చేయవచ్చని పేర్కొన్నారు. మరిమడ్ల-మానాల మధ్య ఉన్న ప్రాంతాలతో పాటు సీమర్ల ఒర్రె, సూరమ్మ బుగ్గ ఒర్రె తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న చెక్‌డ్యామ్‌లను పరిశీలించి, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టడంతోపాటు కొత్త నిర్మాణాల ఏర్పా టుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాలవాగు వద్ద నీటి నిల్వ సదుపాయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైతే పైప్‌లైన్‌ ద్వారా మరిమడ్ల గ్రామా నికి తాగునీరు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు. అందుబాటులో ఉన్న సహజ నీటి వనరులను గ్రామీణ ప్రజల అవసరాలకు అనుగు ణంగా వినియోగించుకునేలా సాంకేతి కంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించి కార్యా చరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. రుద్రంగి అటవీ ప్రాంతం లోని సీమర్ల ఒర్రె, గోలేపు లొద్ది, సూరమ్మ బుగ్గ ఒర్రె, రెండు గట్ల వాగు తదితర ప్రాంతాల్లోనూ నీటి ప్రవాహాలు, నిల్వకు అనువైన ప్రదేశాలను పరిశీలించామ న్నారు. బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయ సమీపంలోని చెక్‌డ్యామ్‌ ద్వారా నీటిని నిల్వ చేయడం వల్ల సమీప గిరిజన తండాలకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, సింగిల్‌ విండో చైర్మన్లు చేపూరి గంగాధర్‌, బొమ్మెన భాస్కర్‌రావు, నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, ఫిరోజ్‌బాషా, రుక్మిణి, మానుక సత్యం, ఉప్పుల గంగయ్య, సదానందం, కోలా స్వప్న, నాలుక సత్యం, సర్పంచ్‌ గండి నారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్య క్షుడు ఎర్రం గంగనర్సయ్య, తర్రె మనోహర్‌, గడ్డం శ్రీని వాస్‌రెడ్డి, కేసిరెడ్డి నర్సారెడ్డి, పల్లి గంగాధర్‌, దయ్యాల శ్రీనివాస్‌, ఎర్రం అరవింద్‌, పోగుల మహేష్‌, సిరికోండ రవి, పూదరి ప్రశాంత్‌, కట్కూరి దాసు, ఈర్నం నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2026 | 11:42 PM