చివరి గింజ వరకూ కొంటాం
ABN , Publish Date - May 29 , 2026 | 12:04 AM
చివరి గింజ వరకూ కొంటామని, రైతులు ఆందోళన చెంద వద్దని సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు
కరీంనగర్ రూరల్, మే 28 (ఆంధ్రజ్యోతి): చివరి గింజ వరకూ కొంటామని, రైతులు ఆందోళన చెంద వద్దని సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఇబ్బందులను ఆయన దృష్టికి తీసు కెళ్లారు. వెంటనే అధికారులతో మాట్లాడి కాంటాలు వేసి సెంటర్‌లో ధాన్యం లేకుండా చూడాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనాలు, హమాలీల కొరతతోనే ధాన్యం కాంటాల విషయంలో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ఆందోళన చెందవద్దని అన్నారు. వారం రోజుల్లో సెంటర్ ఎత్తివేత అసత్య మన్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అన్నదాతలకు అండగా ఉంటామని అన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ పెంచాల లక్ష్మణ్ రావు, ఉప సర్పంచ హన్మంతరావు, సెంటర్ ఇనచార్జి అజయ్, అవోక్ రెడ్డి, కృష్నారెడ్డి, సాయిల్ల రాజు, శేఖర్ తదితరులు ఉన్నారు.