Share News

నారాయణపూర్‌ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:18 AM

చొప్పదండి నియోజకవర్గ నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

నారాయణపూర్‌ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

గంగాధర, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): చొప్పదండి నియోజకవర్గ నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం గంగాధర ప్రజా కార్యాలయంలో నారాయణపూర్‌ గ్రామంలో రిజర్వాయర్‌ కింద ఇళ్లు కోల్పోయి పరిహారం మంజూరైన లబ్ధిదారులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నారాయణపూర్‌ రిజర్వాయర్‌ ముంపు బాధితులను ఆదుకుంటామని అన్నారు. పదిహేను రోజుల్లో నారాయణపూర్‌ గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడుతానన్నారు. రిజర్వాయర్‌ కింద ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాబు మల్లేశం, కిరణ్‌, కార్తిక్‌, రాగుల మల్లయ్య, శ్రీనివాస్‌, తిరుపతి, బాబు నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 12:18 AM