వేములవాడ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:27 AM
వేములవాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): వేములవాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం నుంచి బ్రిడ్జి వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ స్తంభా ల ఏర్పాటును శనివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజల, రాజన్న భక్తుల 50యేళ్ల చిరకాల కోరిక రోడ్డు వెడల్పు పనులు జరగాలని అన్నారు. ప్రజల, భక్తుల ఆకాంక్ష మేరకు పనులు శరవేగంగా జరుగుతు న్నాయని తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో రోడ్డు మద్యలో వున్న పాత విద్యుత్ స్తంభాలను తొలగించి అత్యాధునికమైన నూతన స్తంభాలను మంజూరు చేశామని అన్నారు. భవిష్యత్తులో విద్యుత్ లైన్ల నిర్వహణ సులభతరం కావడమే కాకుండా పట్టణ సుందరీకరణ పెరుగు తుందన్నారు. త్వరితగతిన రోడ్డు వెడల్పు పనులను పూర్తిచేస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.