Share News

అంబేద్కర్‌ ఆశయ సాధనకు పాటుపడాలి

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:45 AM

అంబేద్కర్‌ ఆశయ సాధన ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మహనీయుల ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

అంబేద్కర్‌ ఆశయ సాధనకు పాటుపడాలి

సిరిసిల్ల, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి) : అంబేద్కర్‌ ఆశయ సాధన ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మహనీయుల ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్ర హానికి ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌. కలెక్టర్‌ గరీమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బి గితే తదితరులు పూలమాలలు వేసి, నివాళు లర్పించారు. అనంతరం సభ వేదిక వద్ద అంబేద్కర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి, కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణా ళిక కార్యక్రమంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్‌ అలైవ్‌లో భాగంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. రవాణా శాఖ రూపొందించిన పోస్టర్లను ఆవి ష్కరించారు. కులాంతర వివాహం చేసుకున్న 8 మంది జంటలకు రూ 2.50 లక్షల ప్రోత్సాహక బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. మహనీయుల ఆలోచన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అంబేద్కర్‌ గొప్ప రాజ్యాంగానికి అందించారని గుర్తుచేశారు. వివిధ కులాల, మతాల ప్రాంతాల సమూహాల ఆలోచనకు అనుగుణంగా రాజ్యాం గాన్ని రచించారని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారని, గురుకులాల డైట్‌, కాస్మొటిక్‌ చార్జీలను పెంచారని తెలిపారు. విద్యార్థులకు పోషక విలు వలతో కూడిన ఆహారం అందజేయాలని ఒకే రకమైన మెనూ తీసుకొచ్చార ని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యా శాఖ తన వద్ద పెట్టుకొ ని విద్య విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. రూ 200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తు న్నామని, ప్రతి నియోజకవర్గనికి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తు న్నామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు వచ్చి వారి సమ స్యలు తమ, అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారని తెలిపారు.నూతన రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నామని, సన్నంబియ్యం పంపిణీ చేస్తున్నా మన్నారు. సొంతింటి నిర్మాణం కోసం రూ.5లక్షల ఆర్థిక సహాయం మంజూ రుచేస్తున్నామని తెలిపారు. నేతన్నలకు అండగా ప్రజా ప్రభుత్వం ఉంటుం దని తెలిపారు. సుమారు రూ వేయ్యి కోట్లతో రాజన్న సిరిసిల్ల జిల్లా అభి వృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఇచ్చిన సూచనలు సలహాలు పాటి స్తున్నామని చెప్పారు. బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకల సభలో మా ట్లాడిన వారి మాటలు పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహా నిర్మాణం చేసుకుందామని చెప్పారు. వేములవాడలో రూ.26లక్షలతో అంబే ద్కర్‌ చౌరస్తాను ఆధునీకరించామని గుర్తుచేశారు.

అంబేద్కర్‌ స్ఫూర్తితో ఇతర దేశాల్లో రాజ్యాంగాలు

- కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

డాక్టర్‌ అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆఫ్రికా, దక్షిణఅమెరికా దేశాలు వారి దేశాల రాజ్యాంగాన్ని రచించాయని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కొనియాడారు. గత నెలలో జగ్జీవన్‌ రామ్‌, అంబే ద్కర్‌ జయంతి వేడుకల సన్నాహక సమావేశం నిర్వహించామని, అన్ని శాఖల జిల్లా అధికారులు జయంతి వేడుకలకు హాజరయ్యారని తెలిపారు. దేశంలో గత ఏడాది 4.80 లక్షల ప్రమాదాలు జరిగాయని, 1.70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. రోడ్డు భద్రత నియమాలు పాటి స్తే వీటిని దూరం చేయవచ్చని తెలిపారు. ఎస్సీ, ఇతర రెసిడెన్షియల్‌ విద్యా లయాల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ, హాస్టళ్ల పర్యవేక్షణకు మండల, జిల్లా స్థాయి అధికారులను నియమించామని, వారు విద్యార్థులతో కలిసి భోజ నం చేసి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారని వివరించారు. ఎస్సీ హాస్టల్లోని విద్యా ర్థులకు ప్రత్యేక తరగతులు ఇటీవల నిర్వహించామని, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా వివిధ రకాల వాహనాలు అందుబాటులో ఉన్నాయని పూర్తి వివరా లకు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారుల్ని సంప్రదించాలని సూచించారు. జయం తి వేడుకల సందర్భంగా పలువురు సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల ను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

అందరికీ పూర్తి సహకారం అందిస్తాం : ఎస్పీ

పోలీస్‌ శాఖ తరఫున అందరికీ పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ మహేష్‌ బి గీతే తెలిపారు. బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయంతో పిల్లలకు మంచి విద్య అందించాలని, ఐక్యత ఇతర అంశాలను బోధించాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అరైవ్‌ అలైవ్‌లో భాగంగా జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అలాగే జిల్లాలో రోడ్‌ సేఫ్టీ, ట్రాఫిక్‌ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. వాకథన్‌ కార్యక్రమం.. డ్రైవర్లకు కంటి పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ఈ వారంలో పోలీస్‌ శాఖ తరఫున వివిధ కార్యక్రమాలు చేస్తామని వివ రించారు. గ్రామరోడ్‌ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచిం చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కారు వాహనదారులు సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘాల ప్రతినిధులు మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవ న్‌రామ్‌ విగ్రహాన్ని కలెక్టరేట్‌ చౌరస్తా, చంద్రంపేట చౌరస్తా ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని సూచించారు. జిల్లాలో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్య లను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ చక్రపాణీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాజు, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్ర చారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, ఏఎస్‌ డబ్ల్యూవో విజయ లక్ష్మి, తెలంగాణ అంబేద్కర్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్‌, రాష్ట్ర కార్యదర్శి అంకని భాను, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి రాగుల రాములు, మాజీ పబ్లిక్‌ ప్రాసి క్యూటర్‌ కొల్లూరి ధర్మేందర్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, టౌన్‌ క్లబ్‌ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆడెపు చంద్రకళ, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఆకునూరు బాలరాజు, మన తెలంగాణ అంబేద్కర్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగుల జగన్‌, దళిత సంఘాల ప్రతినిధులు కంసాల మ ల్లేశం, మేకల కమలాకర్‌, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బా లయ్య, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, రెడ్డి సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బొప్ప దేవయ్య, గడ్డం నర్సయ్య, గోలి వెంకటరమణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:45 AM