Share News

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

ABN , Publish Date - May 27 , 2026 | 12:08 AM

రైత న్నలు వ్యవసాయంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టేలా వారికి సలహాలు సూచనలు ఇస్తూ వారి సంక్షేమం కోసం పాటుపడాలని ప్రభుత్వ విప్‌ వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి

వేములవాడ రూరల్‌, మే 26 (ఆంధ్రజ్యోతి) : రైత న్నలు వ్యవసాయంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టేలా వారికి సలహాలు సూచనలు ఇస్తూ వారి సంక్షేమం కోసం పాటుపడాలని ప్రభుత్వ విప్‌ వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ లోని సినారె కళామందిరంలో ఏర్పాటు చేసిన తెలంగా ణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్‌ మాట్లాడుతూ రైతులకు నూతన పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం పంటలలో సలహాలు సూచనలు అందిస్తూ వ్యవసాయానికి అవసరమైన సమగ్ర సేవల ను అందించాలన్నారు. రైతు విజ్ఞానకేంద్రాలు శాస్తవేత్త లకు, రైతులకు మధ్య వారధిగా పని చేస్తాయన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతు విజ్ఞా నకేంద్రాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఇప్పటికే రైతు విజ్ఞాన కేంద్రానికి 40ఎకరాల భూమిని కేటాయిం చామన్నారు. జిల్లాకు కేటాయించే రైతు విజ్ఞాన కేంద్రా న్ని వేములవాడలో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణ మన్నారు. అనంతరం సిరిసిల్ల, వేములవాడ డివిజన్ల ఆత్మకమిటీ చైర్మన్‌,డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో పాల్గొ న్నారు. రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలిం చారు. ధార్మిక, కార్మిక, వ్యవసాయ రంగాల అభి వృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నేతన్నల కోసం యార్న్‌ డిపోను తీసుకువచ్చామన్నారు. మహిళా సంఘాల బలోపేతం కోసం 8వేల వీవో భవనాలను ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభించార న్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు నియోజకవర్గ పరిధిలో 13 ప్రాంతాల్లో 3311 సబ్‌స్టేష న్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజకీయాల కంటే అభివృద్ధికే ప్రాధాన్యమిస్తామన్నారు. రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. తడిసిన ధా న్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతు లు ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో వేము లవాడ మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వేములవాడ ఆత్మ కమిటీ చైర్మన్‌ ముస్కు ముకుందరెడ్డి, సిరిసిల్ల ఆత్మకమిటీ చైర్మన్‌ రాజిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజు, వైస్‌ చైర్మన్‌ కనికరపు రాకేష్‌, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్‌ అల్దాస్‌ జానయ్య, విస్తరణ అధికారి యాకాద్రి, విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ సాయికుమార్‌, మున్సిపల్‌ కౌన్సి లర్లు, సర్పంచులు, పలువురు నాయకులు, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 12:08 AM