సమస్యలపై పోరాడే వారిని ఎన్నుకోవాలి
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:29 AM
మతోన్మాదులు కావాలా లేక ప్రజల గొంతుకగా నిలిచేవారు కావాలా అంటూ సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు.
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మతోన్మాదులు కావాలా లేక ప్రజల గొంతుకగా నిలిచేవారు కావాలా అంటూ సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని 4, 14వ వార్డుల్లో సీపీఐ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కులం, మతం అన్నం పెట్టదని, ప్రజా సమస్యల పరి ష్కారం కోసం పోరాడే వారిని ఎన్నుకోవాలన్నారు. సీపీఐ 100 సంవత్సరాలుగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తోందన్నారు. నాటినుంచి నేటివరకు ప్రజల హక్కుల కోసం, ప్రజలపక్షాన ఉంటూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజ లతోనే సీపీఐ మమేకమై ఉందన్నారు. బూర్జువా పార్టీల మాదిరిగా ఎన్నికలు వచ్చినపుడు ఓట్ల కోసం వచ్చి అయిదేళ్ల వరకు ముఖం చూపెట్టని వారి పార్టీల లాగా కాకుండా ప్రజా హక్కులను సాధించే అభ్యర్ధులను గెలిపించాలన్నారు. ఆ దమ్ము, ధైర్యం తమ అభ్యర్థులకే ఉంటుందన్నారు. అందుకే సీపీఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యద ర్శి మంద సురర్శన్, కడారి రాములు, తోట కనుకయ్య, కె.వి. అనసూర్య, అజ్జు, వేణు, గాజుల లింగం, రామస్వామి, రాజు, చంద్రయ్య, విజయ్ శ్రీగాధ, దేవదా సు పోశెట్టి, దేవరాజు, పవిత్ర, పండుగ పోచమల్లు, లక్ష్మన్‌లు పాల్గొన్నారు.