Share News

శాస్త్రసాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకోవాలి

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:49 AM

విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్రసాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

శాస్త్రసాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకోవాలి

వేములవాడ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్రసాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌, వాణి విద్యాలయంలో నిర్వహించిన సైన్స్‌ ఫెయిర్‌ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్ర్తీ య దృక్పఽథం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకర మని అన్నారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధికి శాస్త్ర సాంకేతిక రంగం కీలకమని, చిన్ననాటి నుంచే పరిశోధనలకు సంబంధించిన మనస్తత్వం అలవరుచుకోవా లని సూచించారు. శాస్రీతయ దృక్పథం ప్రతి విద్యార్థి జీవితంలో భాగమవ్వా లని, ప్రశ్నించే స్వభావం పెంపొందించుకోవాలని తెలిపారు. సైన్స్‌ అనేది పుస్త కాలకే పరిమితం కాకుండా, దైనందిన జీవితంలో సమస్యలకు పరిష్కారాలు కనుగొనే సాధనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో రాణించాలనే లక్ష్యంతో పని చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరిపడా టీచర్లు నియామకాన్ని డీఎస్సీ ద్వారా నియమించా రని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామ కృష్ణ, మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, కౌన్సిలర్‌ అన్నా రం శ్రీనివాస్‌ కృష్ణవేణి స్కూల్‌ కరస్పాండెంట్‌ శ్రీసన్నిధి వెంకటకృష్ణ ఉన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 12:49 AM