Share News

డ్రగ్స్‌ నియంత్రణకు సమన్వయంతో పని చేయాలి

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:19 AM

జిల్లాలో డ్రగ్స్‌ను నియం త్రించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

డ్రగ్స్‌ నియంత్రణకు సమన్వయంతో పని చేయాలి

సిరిసిల్ల అర్బన్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో డ్రగ్స్‌ను నియం త్రించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధి కారులతో జిల్లా స్థాయి నార్కోటిక్‌ కంట్రోల్‌ సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు. సమావేశంలో నమోదవుతున్న ఎన్‌డీపీఎస్‌ కేసులు, గంజాయి సాగు, నివారణ చర్యలు, మాదకద్రవ్యాల నియంత్రణ చర్య లు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్య క్రమాలను, డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా కలెక్టర్‌ చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్‌ సమావేశంలో పాల్గొనే ప్రతిశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని సూచించారు. 14416 ఆన్‌లైన్‌ నంబరుతో 24 గంటలు టెలీ మానస్‌ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. మానసికం గా ఇబ్బందిపడే వారికి ఫోన్‌తో కౌన్సెలింగ్‌ ఇస్తారని తెలిపారు. డ్రగ్స్‌ మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై పోలీస్‌, ఎక్సైజ్‌, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌లు దుకాణాల్లో తనిఖీలు చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసర మైన చికిత్సలు, కౌన్సెలింగ్‌ అందించాలని, డీఅడిక్షన్‌ సెంటర్‌లో చికిత్స అందించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎక్సైజ్‌ అధికారి శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రజిత, కార్మిక శాఖ నజీర్‌ అహ్మద్‌, డీఐఈవో శరత్‌కుమార్‌, డీఈవో జగన్‌మోహన్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌లు ఖదీర్‌ పాషా, సంపత్‌ కుమార్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 12:19 AM