‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:26 AM
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళి కలో సర్పంచ్‌లు, మున్సిపాల్ చైర్మన్లు, కౌన్సిలర్లు భాగస్వాములు కావా లని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
తంగళ్లపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా పాలన-ప్రగతి ప్రణాళి కలో సర్పంచ్‌లు, మున్సిపాల్ చైర్మన్లు, కౌన్సిలర్లు భాగస్వాములు కావా లని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. గురువారం తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులోని అగ్రికల్చర్ కళాశాల ఆడిటోరియంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని సర్పంచ్‌లకు, మున్సిపాల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు అవగహన, శిక్షణ కార్యక్రమం నిర్వ హించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌లతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో ఐదు దశల్లో కార్యక్రమ లు ఉన్నాయని వెల్లడించారు. ఏప్రిల్ 2వ తేదీన మెదటి దశలో భాగం గా గ్రామసభలు నిర్వహిస్తారని, రెండో దశలో ఏప్రిల్ 16 తేదిన మండ ల స్థాయిలో కార్యక్రమాలు, మూడో దశలో మే 2వ తేదీన నియోజకవ ర్గస్థాయిలో కార్యక్రమాలు, నాలుగో దశలో మే 22వ తేదీన జిల్లా స్థాయిలో విస్తృత కార్యక్రమాలు, ఐదో దశలో జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ వేడుకులు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై సీఎం రేవంతర్‌రెడ్డి ఈనెల 3వ తేదీన ప్రకటించా రని 6వ తేదీ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇన్‌చార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇతర మంత్రులు, విప్, ఎమ్మేల్యేల సమక్షంలో 99రోజుల కార్యచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లు 573 పూర్తి అయ్యా యని, మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నయాని తెలిపారు. 3లక్షల 91 వేల సిలిండర్లు రూ. 500లకే సరఫరా చేశామని, 46,492 మంది రైతు లకు రూ.370కోట్ల 75లక్షలు రుణ మాఫీ చేసినట్లు, లక్ష 26వేల మంది రైతులకు రైతు భరోసా అందించిందని, 22వేల 554 నూతన రేషన్ కార్డులు జారీ చేశామని, వివిధ గృహ జ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, ఇతర సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రజా పాలనలో రాజ్యంగం ప్రకారం స్థానిక సంస్థలు కీలకమని వివరించారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రభుత్వ పాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్ర మాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు కావల్సిన వసతులు, ఇతర అంశాలను ప్రభు త్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు. 99రోజుల ప్రణాళిక పకబ్బం దీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామం, మున్సిపాల్టీలలో నిత్యం పారిశుధ్య పనులు,రోడ్లు, మురుగుకాలువలు శుభ్రం చేయించా లని సూచించారు. ఇంటిపన్ను, ఇతర పన్నులు వసూలు చేయించాలని తెలిపారు. చెత్తను సేకరించి తడి, పొడి చెత్త వేరు చేసి ఎరువు తయా రుచేయాలని అన్నారు. వివిధ శాఖల అధ్వర్యంలో చేపడుతున్న అన్ని కార్యక్రమలపై తమ గ్రామం, మున్సిపల్ పరిధిలో వార్డుల్లో సమాచా రం చేరవేసి భాగస్వామ్యులు అయి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. గ్రామ సభల సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదా రుల వివరాలు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
నిబంఽధనలు పాటించాలి : ఎస్పీ
వాహనాదారులు నిబంధనలు పాటించి డ్రైవింగ్ చేస్తే ప్రమాదాల కు తావు ఉండదని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. గత ఏడాది వివిధ నేరాల్లో 700మంది మరణించారని, అదే రోడ్డు ప్రమాదాల్లో 7వేల మం ది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ద్విచక్క వాహనదారులు ప్రధానంగా హెల్మెట్ లేకుండా వెళ్తుండడంతో ప్రాణాలు కోల్పోతున్నార ని తెలిపారు. హెల్మెట్ ధరించాలని, వాహనం ఎక్కినప్పటినుంచి కింద దిగే వరకు సెల్‌పోన్ వినియోగించవద్దని సూచించారు. చాలా ప్రమా దాలు డ్రంకెన్ డ్రైవ్‌తోనే అవుతున్నాయని తెలిపారు. సెల్‌ఫోన్ మాట్లా డుతూ, మద్యం సేవించి వావాణాలు నడపవద్దని సూచించారు. వ్యవ సాయ కళాశాల విద్యార్ధుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డీఆర్డీవో గీత, జడ్పీ సీఈవో వినోద్‌కుమార్, రవాణా శాఖ అధికారి లక్ష్మ ణ్, జిల్లా వైద్యాధికారి రజిత, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్మ న్లు జందం కళ, రాజు, మున్సిపాల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దీన్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ సునీత దేవి, వ్యవ సాయ శాఖాధికారి ఆఫ్జల్ బేగం, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అధికారులను నిలదీసిన సర్పంచ్ నిర్మల..
నిధులు ఇయ్యరు.. అన్ని పనులకు సర్పంచ్‌లు ముందుండాలి అంటారు.. అంటూ శిక్షణ కార్యక్రమంలో పద్మనగర్ సర్పంచ్ మోర నిర్మల అధికారులను నిలదీశారు. గ్రామ పంచాయతీలకు ప్రధాని, ము ఖ్యమంత్రి నిధులు ఇవ్వడం లేదన్నారు. నిధులు లేక ఇబ్బందులు పడు తున్నామని, సర్పంచ్‌లంటే చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నించారు.