Share News

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:38 AM

రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు చురుకైన పాత్ర పోషించాలని వేములవాడ ఏఎస్పీ రుత్విక్‌ సాయి అన్నా రు.

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి

వేములవాడ టౌన్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు చురుకైన పాత్ర పోషించాలని వేములవాడ ఏఎస్పీ రుత్విక్‌ సాయి అన్నా రు. శుక్రవారం అగ్రహారం కే కన్వెన్షన్‌ హాల్లో నిర్వహిం చిన ‘అరైవ్‌-అలైవ్‌’ అవగాహన కార్యక్రమంలో జేఎన్టీ యూ, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థుల కు ఆయన ముఖ్య సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించా లంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో సీటుబెల్ట్‌ వినియోగం అలవాటు చేసుకోవా లని చెప్పారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడ పడం వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండా లని హెచ్చరించారు. సైబర్‌ నేరాలపై కూడా అప్రమత్తం గా ఉండాలని, అనుమానాస్పద లింకులు క్లిక్‌ చేయవ ద్దని విద్యార్థులకు సూచించారు. గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపు నిచ్చారు. మహిళలు ఎలాంటి వేధింపులు ఎదురైనా జిల్లా షీ టీమ్‌ నంబర్‌ 8712656425ను నిర్భయంగా సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో వేములవాడ పట్టణ ఇన్‌స్పెక్టర్‌ బి. వీరప్రసాద్‌, ట్రాఫిక్‌ ఆర్‌ఐ మోడెం సురేష్‌, ఎస్‌ఐలు రామ్మోహన్‌, సముద్రాల రాజు, షీ టీమ్‌ ఏఎస్‌ఐ ప్రమీల సిబ్బంది, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:38 AM