Share News

పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి..

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:08 AM

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ మేడిపల్లి సత్యం అన్నారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో గురువారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి..

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ మేడిపల్లి సత్యం అన్నారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో గురువారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కొన్ని సందర్భాల్లో తీవ్రంగా ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అందరూ ఐక్యంగా ఉండి పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 15 రోజులకు ఒక సారి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వంపై, పార్టీపై జరుగుతున్న విష ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఎస్‌ఐఆర్‌ను వంద శాతం పూర్తి చేయడంలో కాంగ్రెస్‌ కార్యవర్గ సభ్యులు, మండలఅధ్యక్షులు కృషి చేయాలన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సోషల్‌ మీడియా ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అదే సోషల్‌ మీడియా ద్వారా ప్రతిపక్షాలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లాలోని మండల, పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 12:08 AM