Share News

వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు పాటుపడాలి

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:15 AM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు పాటుపడాలి

వేములవాడ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ జయంతి కార్యక్రమానికి ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి చక్కటి అను బంధం ఉందని గుర్తు చేశారు. ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిందే వైఎస్‌ఆర్‌ అని, ప్రజా పథంలో భాగంగా మల్యాల గ్రామంలో రూ. 1737 కోట్లతో ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి ప్రాజెక్టుకు పునాది వేశారని అన్నారు. 2009 సంవత్సరంలో రుద్రంగి, జోగాపూర్‌, చందుర్తి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో కలికోట సూరమ్మ ప్రాజెక్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వర ద కాలువ, ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసిందుకు కృషి చేసింది వైఎస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. అగ్రహారంలో ఎలాంటి కార్పస్‌ ఫండ్‌ లేకుండా సైన్స్‌ వింగ్‌ ఏర్పాటు చేశారని, పేద ప్రజల ఆరాధ్య దైవంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిలిచారని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తూమ్‌ మధు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కనిక రపు రాకేష్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 12:15 AM