కొనుగోళ్లు, ధాన్యం తరలింపులో అలసత్వం వీడాలి
ABN , Publish Date - May 15 , 2026 | 11:56 PM
అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అద నపు కలెక్టర్ గడ్డం నగేశ్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు.
ఎల్లారెడ్డిపేట, మే 15 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అద నపు కలెక్టర్ గడ్డం నగేశ్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. అందుబాటులో నిరుపయోగంగా ఉన్న గోదాంలను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు కొనుగోళ్లు, ధాన్యం తరలింపులో అలసత్వం వీడాలని పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. కొనుగోళ్లు, వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. తూకం వేయడం, ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించడంలో ఆలస్యమవుతోందని రైతులు వాపోయారు. దాంతో స్పందించిన కలెక్టర్ నగేశ్ కాంటాలను వేగవంతం చేసి ధాన్యం తరలింపును త్వరితగతిన చేపట్టాలని అధికారులు, నిర్వాహకులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో కొనుగోళ్లను పూర్తిచేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సుజాత,ఆర్‌ఐ శ్రవణ్ తదితరులు ఉన్నారు.
ఇల్లంతకుంట (సిరిసిల్ల అర్బన్) : కొనుగోలు చేసిన ధాన్యం తరలిం పుతోపాటు రైస్‌మిల్లులు, గోదాంలలో అన్‌లోడింగ్‌లలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులు, నిర్వహకులను ఆదేశించారు. ఇల్లంతకుంట మండలంలోని తాళ్లపల్లిలోని రాజరాజేశ్వర రైస్‌మిల్లుతో పాటు రహీంఖాన్‌పేటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం, పొత్తులలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్ తనిఖీ చేపట్టారు. ధాన్యం కొనుగోలు,తరలింపు ప్రక్రియలను పరిశీలించి కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లుల యజమానులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ కొనుగో లు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించి తూకం వేసిన బస్తాలను వాహ నాల ద్వారా మిల్లులకు వేగవంతంగా తరలించాలని, కాంట్రాక్టర్లు వాహ నాలు సమకూర్చి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అకాలవర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాల న్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేయాల న్నారు. అందుబాటులో నిరుపయోగంగా ఉన్న గోదాములను ధాన్యం నిల్వచేసేందుకు ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా మిల్లుల్లో హమాలీల సంఖ్య పెంచుకుని వాహనాల్లోని ధాన్యం బస్తాలను వేగంగా అన్‌లోడింగ్ చేయాలని సూచించారు. మిల్లులను పర్యవేక్షించడానికి కేటాయించిన సిబ్బంది అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా చూడాలని ఆదే శించారు. వెంట తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
బోయినపల్లి : వరి ధాన్యం తరలింపు, రైస్ మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని అన్‌లోడింగ్ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారు లను, రైస్‌మిల్లర్‌ను ఆదేశించారు. బోయినపల్లి మండలం మనువాడ, కొదురుపాక కొనుగోలు సెంటర్లను అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలిం చారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని, కేంద్రాల లో వసతులు ఎప్పటికప్పుడు కల్పించాలన్నారు.