మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:44 AM
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పురపాలికల్లో విజయకేతనం ఎగరవేసి బీజేపీ సత్తా చాటాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
-బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు
జగిత్యాల అగ్రికల్చర్, జనవరి11 (ఆంధ్రజ్యోతి): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పురపాలికల్లో విజయకేతనం ఎగరవేసి బీజేపీ సత్తా చాటాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్ధానిక ఉమాశంకర్ గార్డెన్‌లో మున్సి పల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఆది వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచిం చారు. పోటీచేసే అభ్యర్థులు తమ వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి, పరిష్కారమే లక్ష్యంగా ముందుకుసాగాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ప్రజల మెప్పు పొందే దిశగా కార్యాచరణతో పనిచేయాలన్నారు. బూత్ లెవల్ నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల ఆశీర్వాదంతో విజయబావుటా ఎగర వేయాలని జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బాధ్యులు కొక్కు గంగాధర్, బోగ శ్రావణి, నలువాల తిరుపతి, దశరథరెడ్డి,పిల్లి శ్రీనివాస్, సాంబారి కళావతి, జుంబర్తి దివాకర్, రాగిల్ల సత్యనారాయణ, కాయితి శంకర్, ఆముద రాజు, సిరికోండ రాజన్న, రాపర్తిరాజు, గడ్డల లక్ష్మీ, భానుప్రియ, మేకల లక్ష్మీతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.