భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలి
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:31 PM
ఆర్థిక అసమానతలు, రాజకీయ పరిస్థితులపై నేటి తరానికి తెలియజేసి భవిష్యత్తు పోరాటాలకు కార్యో న్ముఖులను చేయాలని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి అన్నారు.
భగత్‌నగర్, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ఆర్థిక అసమానతలు, రాజకీయ పరిస్థితులపై నేటి తరానికి తెలియజేసి భవిష్యత్తు పోరాటాలకు కార్యో న్ముఖులను చేయాలని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో జరిగే సీపీఐ జాతీయ శత జయంతి ఉత్సవాల ముగింపు ఉత్సవాలను జయ ప్రదం చేయాలని కోరారు. శనివారం సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జిల్లా కార్యవర్గ సభ్యుల, మండల కార్యదర్శిల సంయు క్త సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన చాడ మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా సీపీఐ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రజలు హాజరుకానున్నట్లు తెలిపారు. వందేళ్ల సీపీఐ సమర చరిత్రను నేటి తరానికి తెలియజేయాలన్నారు. ఖమ్మం ఎస్‌ఆర్ ఆండ్ బీజి ఎస్‌ఆర్ కళాశాల మైదానంలో జరిగే ఈ సభకు అన్ని రాష్ట్రాల నుంచి సీపీఐ నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. 18న బహిరంగ సభ సంద ర్భంగా ఖమ్మం పెవిలియన్ మైదానం నుంచి 15వేల జనసేవాదళ్ కార్యకర్తలు కవాతు చేస్తారని, వీరితో పాటు కళాకారులు వృత్తి సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తూ ప్రజా సంఘాల కార్యకర్తలు ఆయా వృత్తుల వేషధారణలతో పాల్గొంటారన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్ కుమార్, బోయినీ అశోక్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నాగేల్లి లక్ష్మారెడ్డి, బత్తుల బాబు, న్యాలపట్ల రాజు, గూడెం లక్ష్మి, మండల కార్యదర్శులు బండ రాజిరెడ్డి, లంక దాసరి కళ్యాణ్, గోవిందుల రవి తదితరులు పాల్గొన్నారు