మొక్కలను నాటి సంరక్షించాలి
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:38 PM
మొక్కలను నాటి సంరక్షిం చాలని ఎస్పీ మహేష్ బీగీతే కోరారు.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : మొక్కలను నాటి సంరక్షిం చాలని ఎస్పీ మహేష్ బీగీతే కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శని వారం పరిశుభ్రతతోపాటు వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా పోలీసులు కార్యాలయంలో పారిశుధ్య పనులు చేపట్టారు. అనంత రం కార్యాలయ ఆవరణంలో మొక్కలను ఎస్పీ మహేష్ బీగీతే నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంగా తీర్చిదిద్దడం వల్ల పోలీస్ సిబ్బందితో పాటు కార్యాలయానికి వచ్చే ప్రజల కు సైతం మంచి వాతావరణం కల్పించవచ్చన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు ప్రతీఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు మధుకర్, సురేష్, రమేష్, సీఐలు మొగిలి, మధుకర్, ఎస్‌ఐలు కిరణ్‌కుమార్, ఆర్‌ఎస్‌ఐలు రాజు, శ్రావణ్, సాయికిర ణ్, దిలీప్, రాజు తదితరులు పాల్గొన్నారు.