జనగణన సిబ్బందికి సహకరించాలి
ABN , Publish Date - May 11 , 2026 | 11:39 PM
జనగణన -2027 మొదటి దశ లో భాగంగా జూన్ 9తేది వరకు ఇంటింటికీ వచ్చి ఎన్యూమరేష న్ చేసే సిబ్బందికి ప్రజలు సహకరించాలని కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్ కోరారు.
సిరిసిల్ల, మే 11 (ఆంధ్రజ్యోతి) : జనగణన -2027 మొదటి దశ లో భాగంగా జూన్ 9తేది వరకు ఇంటింటికీ వచ్చి ఎన్యూమరేష న్ చేసే సిబ్బందికి ప్రజలు సహకరించాలని కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్ కోరారు. జనగణన మొదటి దశలో భాగంగా సోమవారం సిరిసిల్ల పట్టణంలో సుభాష్‌నగర్ లో ఎన్యూమరేటర్లు ఇళ్ల గణన కోసం చేస్తున్న మ్యాపింగ్ ప్రక్రి యను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.గణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, గణాంకాల రూపకల్పనకు సమగ్ర, ఖచ్చితమైన వివరాలను ప్రజలు అందించి జనగణన సిబ్బందికి సహకరించా లన్నారు. మూడు రోజుల పాటు ఇళ్ల గణన కోసం బ్లాక్ వారీగా మ్యాపింగ్ చేస్తారని, తదనంతరం ప్రతీ ఇంటి నుంచి వివరాలు సేకరిస్తారని తెలిపారు. జిల్లాలో 173మంది సూపర్‌వైజర్లు, 1025 మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ అందించామని, ఎన్యూమరేటర్లకు ఫొటో, క్యూఆర్ కోడ్ కలిగిన గుర్తింపు కార్డులు అందించామని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వారి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. వారు అడిగే 33 రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సహకరించాలని కోరారు. వేసవికాలం దృష్ట్యా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. పరిశీలనలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస చారి, మున్సిపల్ కమీషనర్ ఖదీర్ పాషా, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, తదితరులు ఉన్నారు.