Share News

శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి

ABN , Publish Date - May 15 , 2026 | 12:13 AM

శాంతిభద్రతల పరి రక్షణకు అందరు సహకరించాలని ఎస్పీ మహేష్‌ బీగీతే కోరారు.

శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి

సిరిసిల్ల అర్బన్‌, మే 14 (ఆంధ్రజ్యోతి) : శాంతిభద్రతల పరి రక్షణకు అందరు సహకరించాలని ఎస్పీ మహేష్‌ బీగీతే కోరారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా సమాచారం హెల్ప్‌లైన్‌నంబర్‌ 8712537826కు సమాచారం ఇవ్వాలని సూచిం చారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం హిందూ సం ఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. రానున్న బక్రీద్‌ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు, సామరస్య వాతావరణంలో కొనసాగేందుకు ప్రతి ఒక్కరు పోలీస్‌ శాఖకు సహకరించాలని కోరారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో మూడు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటుతోపాటు ప్రతి స్టేషన్‌ పరిధిలో 24గవంటల వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. పశువుల రవాణాపై గోవధ నిరోధక చట్టం, ట్రాన్స్‌ఫోర్‌ ఆఫ్‌ యానిమల్స్‌ రూల్స్‌, ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయెల్టీ టు యానియల్స్‌ చట్టాలను కచ్చితంగా అమలుచేస్తామన్నారు. పశువు ల రవాణా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని, పశువుల రవాణాపై అనుమానాల పేరుతో రోడ్ల దిగ్బంధాలు, ఘర్షణాత్మక పరి స్థితులు సృష్టించవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే రౌడీ, సస్పెక్ట్‌ షీట్లు కూడా తెరుస్తానమని స్పష్టం చేశారు. గత సంవత్సరం రెండు కేసులు నమోదు చేశామని ఈసందర్భంగా గుర్తు చేశారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ 8712537826కు లేదా నోడల్‌ అధికారి స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ 8712656410తో పాటు పోలీస్‌లకు సమాచారం అందించాలన్నారు. పశువులను అక్రమంగా తరలించే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐ రవి, ఎస్‌ఐ శ్రీకాంత్‌, హిందూ సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 12:13 AM