Share News

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:37 AM

స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమ యో ధుడు, ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూ జీ ఆశయాలను యువత ముందు కుతీసుకెళ్లాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు.

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమ యో ధుడు, ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూ జీ ఆశయాలను యువత ముందు కుతీసుకెళ్లాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో కొండా లక్ష్మణ్‌బాపూ జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యానగర్‌ మొదటి రగుడు బైపాస్‌ చౌరస్తాలోని బాపూ జీ విగ్రహానికి మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌ కుమార్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, జిల్లా గ్రం థాలయం చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, సిరి సిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, సిరిసిల్ల కాంగ్రెస్‌ పట్టణ మాజీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌ పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడారు. అణగా రిన వర్గాల హక్కుల కోసం కొండా లక్ష్మణ్‌ బాపూజీ సాహసోపేతంగా పోరాడారన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పార్టీలకు, వర్గాలకతీతంగా ముందుకు తీసుకెళ్లడం లో కీలకపాత్రను పోషించారన్నారు. చేనేత కార్మికు లు, పద్మశాలీలతో పాటు ఇతర బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మా ట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,టీపీసీసీ అధ్యక్షుడు మహే ష్‌కుమార్‌గౌడ్‌ నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్య దర్శి వేముల దామోదర్‌, పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, ప్రధాన కార్యదర్శి నీలి రవీందర్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కాముని వని తనళినీకాంత్‌, కౌన్సిలర్లు బొద్దుల శ్రీనివాస్‌, లింగం పల్లి గంగరాజు,కూర శ్రీశైలం, మాజీ కౌన్సిలర్‌ యెల్లె లక్ష్మినారాయణ, సెస్‌ డైరెక్టర్‌ సుధాకర్‌, మార్కెట్‌ కమిటి డైరెక్టర్స్‌ దుబాల వెంకటేశం, ఎండీ ఖాజా, తదితరులు పాల్గొన్నారు. కాగా, స్థానిక విద్యానగర్‌ బైపాస్‌ చౌరస్తాలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి, వైస్‌చైర్మన్‌ దార్ల సం దీప్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్ట ణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, తదితరులు పూలమాల లు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Updated Date - Sep 28 , 2026 | 12:37 AM