Share News

అమరులు కోరుకున్న సమాజాన్ని నిర్మించాలి

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:02 AM

అమరులు కోరుకున్న సమాజా న్ని నిర్మించడమే వారికి మనమిచ్చే సరైన నివాళి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత అన్నారు.

అమరులు కోరుకున్న సమాజాన్ని నిర్మించాలి

చందుర్తి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): అమరులు కోరుకున్న సమాజా న్ని నిర్మించడమే వారికి మనమిచ్చే సరైన నివాళి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత అన్నారు. చందుర్తి మండలం సనుగులలో నిర్వహించిన అమరుల యాది కార్యక్రమంలో మంగళవారం ఆమె మా ట్లాడుతూ సబ్బండ వర్గాలు, కులాలకు అధికారంలో భాగస్వామ్యం దక్కినప్పుడే అమరుల త్యాగాలకు ఫలితం ఉంటుందన్నారు. సమాజం కోసం ఓ వ్యక్తి తన ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం చేస్తుంటే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ నిమ్స్‌లో 11రోజులపాటు నిరాహార దీక్ష చేస్తు న్నప్పుడు కుటుంబ సభ్యులుగా ఎంత నరకయాతన అనుభవించామో తనకు మాత్రమే తెలుసన్నారు. కేసీఆర్‌తో ఇప్పుడు రాజకీయంగా విభే దించినా, దారులు వేరైనా సమాజం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మాత్రం మర్చిపోవద్దన్నారు. అదేవిధంగా తెలంగాణ కోసం అమరులైన వారిని, మంచి సమాజం కోసం అప్పట్లో ఈ ప్రాంతంలో అసువులు బాసిన మావోయిస్టులను గుర్తు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. వారు ఆకాంక్షించిన సమాజాన్ని నిర్మించాల్సి ఉందన్నారు. అమరుల త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఆ ఫలాలు నిజంగా అందరికీ దక్కాయా అన్నది సమీక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ వచ్చి 13 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటికీ పేదవాళ్లు మెరుగైన విద్య, వైద్యం కోసం పోరాడుతునే ఉన్నారని, ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అని ప్రశ్నించారు. ఆనాడు భూస్వాములు, దొరలపై పోరాడి తే.. ఇప్పుడు అధికారం అడ్డం పెట్టుకొని దోచుకుంటున్న వాళ్లపై పోరా టం చేస్తున్నామన్నారు. దోపిడీ విధానం మారిందే తప్ప వారిలో ఆ స్వభావం మారలేదని.. అది మారాలంటే నిరంతరం పోరాటం చేయాల న్నారు. యువత, మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే పరిస్థితి మారు తుందన్నారు. మాజీ మావోయిస్టులు, అమర వీరుల కుటుంబాలకు న్యాయం జరిగేలా తాము పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క, మాజీ జడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్‌, నాయకులు ఇస్మాయిలు, పడాల మనోజ, పవన్‌ కుమార్‌, శివారెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు నాగరాజు, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌, పెద్దపల్లి ఇన్‌చార్జి కొమరయ్య, మానుకొండూర్‌ ఇన్‌చార్జి చైతన్య, జిల్లా అధ్యక్షురాలు సుమలత శర్మ, సిరిసిల్ల ఇన్‌చార్జి మజీద్‌, ఈడుగు రజనీకాంత్‌, మండలంలోని పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్‌

చందుర్తి మండలం సనుగుల గ్రామంలో జరిగిన ఈడుగు శంకర్‌ సంస్మరణ సభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ శంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:02 AM