Share News

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:39 AM

పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు.

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

గంభీరావుపేట, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండలం గోరంటాల బీట్‌ పరిధిలోని గజసింగవరం గ్రామ శివారులో మంగళవారం వన మహోత్సవం కింద మెగా ప్లాంటేషన్‌ కార్యక్ర మాన్ని నిర్వహించగా, ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ హాజరై మొ క్కలు నాటి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అడవులను అందరూ సంరక్షించాలని పిలుపునిచ్చారు. దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని, అడవులతోనే వర్షాలు కురుస్తాయన్నారు. అటవీ విస్తీర్ణం తగ్గ డంతో వన్యప్రాణులు, పక్షుల మనగడకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వన్యప్రాణులు ఇండ్లలోకి వస్తున్నాయని, అలాగే పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువ గా కురిసే అవకాశం ఉందని, జిల్లామొత్తం లక్ష్యం 8,65,200 కాగా, మొత్తం 6,89,212 మొక్కలు నాటి 79.66శాతం లక్ష్యం పూర్తిచేశామని వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెటీ చైర్‌పర్సన్‌ కొమురిశెట్టి విజయ, సర్పంచ్‌ లతిక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, డీఆర్‌డీవో లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌బేగం, జిల్లా వైధ్యాధికారి ఏంజెలా ఆల్ఫెడ్‌, మిషన్‌ భగీరథ ఈఈలు అన్వర్‌, సుమ ల, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శర త్‌బాబు, ఎంపీడీవో రాజేందర్‌ తదితరులు ఉన్నారు.

భూముల రీ సర్వే కచ్చితత్వంతో చేయాలి

భూభారతి కింద భూముల రీసర్వే కచ్చితత్వంతో చేయాలని కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ ఆదేశించారు. కుర్దులింగంపల్లిలో భూ భారతి కింద రోవర్‌ యంత్రంతో భూముల రీ సర్వే పనులు కొనసాగుతుండగా పరిశీలించారు. గ్రామ సరిహద్దు సర్వే పూర్తి అయిందని, ప్రస్తుతం ప్రభుత్వ భూముల సర్వే కొనసాగుతుందని కలెక్టర్‌ దృష్టికి అధికారులు తీసుకెళ్ళారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో భూభారతి కింద భూముల రీసర్వే పనులు పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు.

బోర్‌వెల్‌ రీచార్జ్‌ పనుల పరిశీలన

మండలంలోని గజసింగవరంలో బోర్‌వెల్‌ రీచార్జ్‌ పనులను కలెక్టర్‌ పరి శీలించారు. రైతులు, గృహ నిర్మాణాదారులు బోర్‌వెల్‌ రీచార్జ్‌ పనులు చేప టట్టేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్య మైన భోజనంతో పాటు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని కలె క్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించి మధ్యాహ్న భోజనం, స్టోర్‌రూం పరిశీలించి, తరగతి గదులు, వసతి తదితర అంశాలపై వివరాలు ఆరా తీశారు. విద్యార్థుల సౌకర్యార్థం నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పురోగ తిని కలెక్టర్‌ పరిశీలించారు. త్వరలో తరగతి గదుల నిర్మాణాలు పూర్తి చే యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న టాయిలెట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి వినియోగంలోకి తీసుకరావాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలతో పను లు చేపట్టి గడువులోగ పూర్తి చేయాలని అన్నారు. విద్యాలయంలో నీటి సర ఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని మిషన్‌ భగీరథ గ్రిడ్‌, ఇంట్రా అధి కారులను ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఇత ర సదుపాయాలపై కలెక్టర్‌ ఆరాతీశారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యమైన పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని సూచించారు. వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, సౌక ర్యాలు కల్పించాలన్నారు. సర్పంచ్‌ మల్లుగారి పద్మ, పంచాయతీరాజ్‌ ఈఈ సుదర్శన్‌రెడ్డి, మిషన్‌ భగీరథ గ్రిడ్‌, ఇంట్రా ఈఈలు అన్వర్‌, సుమలత, ఎంపీడీవో రాజేందర్‌, జీసీడీవో పద్మజ తదితరులు ఉన్నారు.

రైతును అభినందించిన కలెక్టర్‌

మండలంలోని గజసింగవరంలో రైతు బోయిన మల్లేశం బంతి పూల సాగు చేపట్టడంతో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మంగళవారం పరిశీలించారు. వివరాలను రైతును అడిగితెలుసుకున్నారు. తనకున్న మూడున్నర ఎకరాల్లో రెండు ఎకరాల్లో బంతి పూల సాగుచేస్తున్నట్టు రైతు మల్లేశం తెలిపారు. వరి పంటను వదిలి బంతిపూల సాగు చేస్తున్న రైతు మల్లేశంను శాలువా తో సన్మానించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వరి పంటకు ప్రత్యమ్నాయంగా బంతి పూల సాగు చేయడం అభినందనీయమన్నారు.పరిశీలనలో సర్పంచ్‌ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అప్జల్‌బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, ఎంపీడీవో రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 12:39 AM