Share News

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:35 AM

పర్యావరణ పరి రక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

రుద్రంగి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ పరి రక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళి క 99 రోజుల కార్యాచరణలో భాగంగా రుద్రంగి మండ లం మానాలలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా వర్షాకాల సన్నద్ధత, పంటల మార్పిడి, వ్యవసాయ, బడి బాట, ఘన వ్యర్థాల నిర్వహ ణ, ఓటర్‌ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, పారిశుధ్యం, వన మహోత్సవం, ఆయిల్‌పామ్‌, రోడ్డు భద్రత, నియ మాలు, గిరిజన సంక్షేమ శాఖ పథకాలు తదితర అంశా లపై గ్రామ ప్రజలతో సుదీర్ఘంగా చర్చించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మార్చి 6వ తేదీన ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా 10 థీమ్‌లతో 10 శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శా ఖల అధికారులు, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, సంపూర్ణ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే గ్రామాల్లోని డైన్రేజీలు శుభ్రం చేయించాలని తెలిపారు. డైన్రేజీల్లో ప్లాస్టిక్‌, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయవ ద్దని కోరారు. ఘన వ్యర్థాల నిర్వహణ 2026 పై ప్రజలు కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని, చెత్తను నాలు గు రకాలుగా వేరు చేయాలని సూచించారు. తడి, పొడి, సానిటరీ, ప్రత్యేక చెత్త గా వేరు చేసి గ్రామ పంచాయతీ వాహనానికి అందించాలని సూచించారు. సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ నిర్వహణపై అవగాహన పొందాలని, నిబంధన లు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుం టామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో గ్రామస్థులను సెగ్రీగేషన్‌ షెడ్లకు తీసుకు వెళ్లాలని సూచించారు. నీటి ట్యాంకులను నెలకు మూడుసార్లు బ్లీచింగ్‌తో సిబ్బంది శుభ్రం చేయాలని ఆదేశించారు. పంటలు సాగు చేసే ముందు వ్యవసాయ అధికారులను సంప్రదించి, ప్రణాళి క ప్రకారం ముందుకు వెళ్తే ఇబ్బందులు ఉండవని వివ రించారు. ఆయిల్‌పామ్‌, సన్నవడ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు తదితర లాభదాయక పంటలను సాగు చేయ డానికి రైతులు ముందుకురావాలని సూచించారు. ఆయి ల్‌ పామ్‌కు సంబంధించి సిద్దిపేట జిల్లా నర్మెటలో పరి శ్రమ ఉందని, పండించిన దిగుబడిని పరిశ్రమకు తీసు కువెళ్లడానికి దూర భారం కూడా లేదని గుర్తు చేశారు. పంట మార్పిడి చేయకపోతే నేల సారం తగ్గుతుందనే విషయాన్ని రైతులు గమనించాలని పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించే బీఎల్‌వోలకు ప్రజలు సహక రించాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గ దర్శకాల మేరకు ఈనెల 25వ తేదీ నుంచి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఓటుహక్కు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ మన్నారు. గుర్తింపు కార్డులు చూపించి మ్యాపింగ్‌ ప్రక్రి యకు సహకరించాలని కోరారు. బడిబా ట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పం పించాలని కోరారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్‌ నిబంధన లు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో యువతకు మార్కెట్‌లో డిమాం డ్‌ ఉన్న కోర్సులలో ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణ ఇస్తున్నారని, 18 నుంచి 35 ఏళ్లలోపు వారు పూర్తి వివరాల కోసం గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. యువత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాల ని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. వన మహో త్సవంలో భాగంగా మొక్కలు నాటాలని ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటుతూ.. సంరక్షణ కు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర కోఆపరేటివ్‌ యూని యన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి మాట్లాడు తూ మానాల గ్రామస్థులంతా ప్రభుత్వ బడికే పిల్లలను పంపిస్తామని తీర్మానించడంపై అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేస్తానని, ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసాచారి, జిల్లా విద్యాధికారి జగన్‌ మోహన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సంగీత, తహసీల్దార్‌ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:35 AM