Share News

మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం...

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:01 AM

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడమేకాకుండా ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం ఉదయం తిమ్మాపూర్‌లోని వాగేశ్వరి ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి కరీంనగర్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వరకు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు.

మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం...

కరీంనగర్‌ అర్బన్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడమేకాకుండా ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం ఉదయం తిమ్మాపూర్‌లోని వాగేశ్వరి ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి కరీంనగర్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వరకు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు బస్సులోని విద్యార్థులు, మహిళా ప్రయాణీకులు, డ్రైవర్‌, కండక్టర్‌తో ముచ్చటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బస్సు దిగిన తరువాత మీడియాతో మాట్లాడారు. ్న ప్రయాణికులకు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేశామని, ఆపరేషనల్‌ లాస్‌ నుంచి ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్నారు. జూన్‌ 21న నీట్‌ రాసే వారికి ఉచిత ప్రయాణం అందించాలని ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌స్వామి కోరగా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి హాల్‌టికెట్‌ ఉన్నవారికి ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో సెంట్రల్‌ ప్రొక్యూర్‌ జరిగినట్లు నిరూపిస్తే ముగ్గురం మంత్రులం రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు సర్‌పై ఇంత ఆందోళన చేస్తుంటే బీజేపీ ఎందుకు స్పందించడం లేదని పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. జిల్లా రాజకీయాల్లో గతంలో కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి, మాజీ ఎంపీ చోక్కారావు ఎలాంటి రాజకీయాలు చేశారో ఇప్పుడు తాను, శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అలాంటి రాజకీయాలు చేస్తున్నామన్నారు.

ఫ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ. మాజీ మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. 1,143 కోట్ల సెంట్రల్‌ ప్రొక్యూర్‌ జరిగితే 2 వేల కోట్ల స్కాం అని మాజీ మంత్రి హరీష్‌ రావు అంటున్నారని, ఇది ఎలా సాధ్యమో ఆయనకే తెలుస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క ఎస్సీ గురుకులానికైనా కొత్త భవనం నిర్మించారా.. అని ప్రశ్నించారు. బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలను పట్టించుకోలేదన్నారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ మంత్రులపై హరీష్‌రావు అవహేళనగా, అసహనంగా ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. తాను జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా చేశానని, విద్యార్థి సంఘ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా చేసిన పొన్నం ప్రభాకర్‌పై, మైనార్టీ మంత్రి అజాహరుద్దీన్‌పై ఇంత అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు. బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌కు అద్దె డబ్బులు చెల్లించక తాళాలు వేస్తే ఆ బకాయిలు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించిందని గుర్తు చేశారు. సమావేశంలో సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 12:01 AM