Share News

రక్తం ఇచ్చాం.. రైతులకు నీరందించాలి..

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:48 PM

రక్తం ఇచ్చాం... ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు నీరందించాలంటూ సిరిసిల్ల పట్టణంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం నిరసనలు తెలిపారు.

రక్తం ఇచ్చాం.. రైతులకు నీరందించాలి..

సిరిసిల్ల టౌన్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : రక్తం ఇచ్చాం... ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు నీరందించాలంటూ సిరిసిల్ల పట్టణంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం నిరసనలు తెలిపారు. ముందుగా తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రక్తదానం చేశా రు. అనంతరం తెలంగాణ భవన్‌ ఎదుట ప్లకార్డులు, బ్లడ్‌ బ్యాగులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాధాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడారు. ఎల్‌నినో వల్ల కరువు దృష్ట్యా రైతులకు పంట పొలాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావు అడిగారన్నారు. ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి ఓ ప్రెస్‌మీట్‌లో కేటీఆర్‌, హరీష్‌రావు వారి రక్తాన్ని పంట పొలాల్లో చల్లాలని మాట్లాడడం దుర్మార్గం అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో రక్తదా నం నిర్వహించగా బీఆర్‌ఎస్‌ నాయకులు రక్తదానం చేశామన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు రక్తదానం చేశారు.. ఇప్పుడైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలోని రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్‌, నాయకుడు చీటి నర్సింగ్‌ రావు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, వివిధ మండ లాల అధ్యక్షులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వేములవాడ : వేములవాడ పట్టణంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు నివాసంలో రేవంత్‌రెడ్డికి రక్త దానం పేరిట శిబిరాన్ని ఏర్పాటుచేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి చల్మెడ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పంటలు ఎండిపోతున్నా రైతనన్నలకు నీళ్లు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తే కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్‌ ఏనుగు తిరుపతిరెడ్డి, సీనియర్‌ నాయకులు రామతీర్థపు రాజు, వెంగళ శ్రీకాంత్‌ గౌడ్‌, వాసాల శ్రీనివాస్‌, నిమ్మశెట్టి విజయ్‌, మారం కుమార్‌, సిరిగిరి చందు, జోగిని శంకర్‌, కందుల క్రాం తి, గూడూరు మధు, నరాల దేవరాజు, నీరటి మల్లేశం, మామిండ్ల కనుకయ్య, మంత సందీప్‌, పెద్ది రాజు తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:48 PM