ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:44 AM
ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తు న్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ రూరల్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తు న్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని ఎదురుగట్ల, లింగం పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహప్రవేశ కార్యక్రమాల్లో గురువారం ఆయన పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ల సొతింటి కల నెరవేర్చే విధంగా అర్హులైన ప్రతీ పేదవాడికి గౌరవప్రదమైన నివాసాన్ని అందించడ మే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. పేదవారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో సర్పంచులు సామ తిరుపతిరెడ్డి, రంగు వెంకటేశం, కడారి సంధ్యశ్రీని వాస్, మార్కెట్‌కమిటీ చైర్మెన్ రొండి రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, నాయకులు సోయినేని కరుణాకర్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట : మండలంలోని నారాయణపూర్, అల్మాస్‌పూర్ గ్రామాల్లో ఇందిరమ్మ గృహా ప్రవేశాల కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు గు రువారం ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసి సొంతింటి కలను సా కారం చేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతిపేదకు ఇం దిరమ్మ ఇంటిని మంజూరుచేసి ఆర్థిక సాయం అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు నర్స య్య, వెంకట్‌రెడ్డి, బాపురెడ్డి, నాయకులు రాంరెడ్డి, గిరిధర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అనిల్, బాలయ్య, శ్రీనివాస్, లక్ష్మీ, గౌస్, బుచ్చాగౌడ్ పాల్గొన్నారు.