Share News

జల సంరక్షణ ప్రతి వ్యక్తి బాధ్యత

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:26 PM

జల సంరక్షణ ప్రతి వ్యక్తి బాధ్యత అని జిల్లా భూగర్భ జల అధికారి శ్యాంప్రసాద్‌నాయక్‌ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా శ్యాంప్రసాద్‌ నాయక్‌ నేతృత్వంలో ఆదరణ సేవా సమితి (స్వచ్ఛంద సంస్థ) సహకారంతో మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూగర్భ జలాల సంరక్షణ, పెంపుదలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

జల సంరక్షణ ప్రతి వ్యక్తి బాధ్యత
సమావేశంలో మాట్లాడుతున్న శ్యాంప్రసాద్‌ నాయక్‌

శంకరపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జల సంరక్షణ ప్రతి వ్యక్తి బాధ్యత అని జిల్లా భూగర్భ జల అధికారి శ్యాంప్రసాద్‌నాయక్‌ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా శ్యాంప్రసాద్‌ నాయక్‌ నేతృత్వంలో ఆదరణ సేవా సమితి (స్వచ్ఛంద సంస్థ) సహకారంతో మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూగర్భ జలాల సంరక్షణ, పెంపుదలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్‌ నాయక్‌ మాట్లాడుతూ ఐక్య రాజ్య సమితి నీటి విభాగం ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుతుందన్నారు. ఈ సంవత్సరం నీరు-లింగ సమానత్వం ప్రధాన ఇతివృత్తంగా ప్రపంచ నీటి దినోత్సవం నిర్వహిస్తున్నారని తెలిపారు నీటి నిర్వహణలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన ప్రస్తావించారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖాధికారి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నీటిని తక్కువగా వినియోగించుకునే పంటలకు సాగు చేయడం ద్వారా జల వనరులని సంరక్షించవచ్చన్నారు. మండల వ్యవసాయాధికారి వెంకటేష్‌ మాట్లాడుతూ పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని రైతులకు వివరించారు.

Updated Date - Mar 24 , 2026 | 11:26 PM