Share News

యుద్ధ ప్రాతిపాదికన ధాన్యం తరలింపు

ABN , Publish Date - May 24 , 2026 | 12:03 AM

జిల్లాలో ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

యుద్ధ ప్రాతిపాదికన ధాన్యం తరలింపు
గంగాధరలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే, సీపీ

గంగాధర, మే 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. మండలంలోని మధురానగర్‌, నారాయణపూర్‌, లక్ష్మీదేవిపల్లి, నాగిరెడ్డిపూర్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె శనివారం రాత్రి పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌ త్వరాగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. అవసరమైన మేరకు వెంటనే లారీలను అందుబాటులోకి తెస్తున్నామని, ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలిస్తున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్‌కు తెలిపారు. జిల్లా యంత్రాంగం రైతులకు ఎలాంటి నష్టం, ఇబ్బందులు రాకుండా చూడాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. అనంతరం గంగాధర మార్కెట్‌ యార్డులో గోదాములను కలెక్టర్‌ పరిశీలించారు. గట్టుబూత్కుర్‌ రైస్‌ మిల్లును పరిశీలించారు. కార్యక్రమంలో సీపీ గౌస్‌ ఆలం, అడిషనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, డీఎం రజనీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 12:03 AM