ఏపీ డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:25 AM
కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్‌టీయు ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కొండగట్టు పర్యటనకు ఏర్పాటు చేసిన హెలీఫ్యాడ్ వద్ద శనివారం ఏపీ డిప్యూటీ సీఎంపవన్‌కల్యాణ్‌కు ఘన స్వాగతం లభించింది.
కొడిమ్యాల, జనవరి 3(ఆంధ్రజ్యోతి): కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్‌టీయు ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కొండగట్టు పర్యటనకు ఏర్పాటు చేసిన హెలీఫ్యాడ్ వద్ద శనివారం ఏపీ డిప్యూటీ సీఎంపవన్‌కల్యాణ్‌కు ఘన స్వాగతం లభించింది. స్వాగతం పలికిన వారిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్, కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.