ఇరాన్‌పై యుద్ధాన్ని ఖండించాలి
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:29 AM
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేపట్టిన యుద్ధాన్ని ప్రజలు ఖండించాలంటూ ఈనెల 29న హైదరాబా ద్‌లోని చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించను న్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సైల్కాబ్‌బాబు తెలిపారు.
సిరిసిల్ల అర్బన్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేపట్టిన యుద్ధాన్ని ప్రజలు ఖండించాలంటూ ఈనెల 29న హైదరాబా ద్‌లోని చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించను న్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సైల్కాబ్‌బాబు తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎంపీ భవనంలో గురువారం సీపీఎం జిల్లా కమిటి సమావేశం సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎగుమంటి ఎల్లారెడ్డి అఽధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి ముఖ్యఅతిదిగా హాజరైన రాష్ట్ర కమిటి సభ్యుడు సైల్కాబ్‌బాబు మాట్లాడుతూ భారత ప్రభుత్వం శాంతి కోసం కృషి చేయడానికి ఒత్తిడి తీసుకరావడానికి ప్రజలు కృషి చేయాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీ లకు చెందిన నాయకులు యుద్ధవిరమణ జరగాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేయాలని కోరారు. అమెరికా సామ్రాజ్యవాదం భారత దేశానికి తీరనిద్రోహం చేస్తుందని, యువతరం దానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మూషం రమేష్, కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, విమల, కోడం రమణ, మల్లారపు అరుణ్‌కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, గురిజాల శ్రీధర్, అన్నల్‌దాస్ గణేష్, మిట్టపల్లి రాజమల్లు, ఎలిగేటి రాజశే ఖర్, గీస బిక్షపతి, మనోజ్, సురేష్, కమలాకర్, అడెపు రజిత, దాసరి రూప, వడ్ల లక్ష్మీ, సావనపల్లి రాములు, గుండు రమేష్, నర్సింహారెడ్డి, రామంచ అశోక్, శ్రీని వాస్, ప్రభాకర్, రాజెల్లయ్య, కిషన్, సుజాత, రమేష్, లక్ష్మీరాజం, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.