Share News

‘ఇందిరమ్మ’ బిల్లుల కోసం నిరీక్షణ..

ABN , Publish Date - Jun 26 , 2026 | 01:01 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇప్పటి వరకు ఇళ్లు నిర్మించుకుని గృహ నిర్మాణాలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

‘ఇందిరమ్మ’ బిల్లుల కోసం నిరీక్షణ..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇప్పటి వరకు ఇళ్లు నిర్మించుకుని గృహ నిర్మాణాలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో లబ్ధిదారు డికి చివరి విడతగా లక్షా 20 వేల నుంచి లక్షా 60 వేల రూపాయల వరకు బిల్లులు విడుదల కావాల్సి ఉన్నా యి. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద ఇవ్వాల్సిన 3 లక్షల 40 వేల రూపాయల బిల్లులను ఇళ్లు పూర్తి చేసిన లబ్ధిదారులకు చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన బిల్లుల గురించే లబ్ధిదారులు కలవరానికి గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1203 మంది లబ్ధిదా రులు కేంద్రం విడుదల చేసే బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాం గ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 2025లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణా నికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. మొదటి విడతలో సొంతంగా స్థలం ఉన్న వారిని గుర్తిం చి ఇళ్లు మంజూరు చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రభుత్వం 3 వేల చొప్పున ఇళ్లను కేటాయిం చింది. అందులో భాగంగా జిల్లాలోని పెద్దపల్లి, రామ గుండం, మంథని నియోజకవర్గాలతో పాటు ధర్మపురి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ధర్మారం మండలానికి 9,438 ఇళ్లను కేటాయించారు. ఇందులో పెద్దపల్లి, రామ గుండం అసెంబ్లీ నియోజకవర్గాలకు 3500 ఇళ్ల చొప్పున, మంథని నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు 1750 ఇళ్లు, ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గల ధర్మారం మండలానికి 688 ఇళ్లు కేటాయించారు. 7,480 ఇళ్లక్లు కలెక్టర్‌ ఆమోదం తెలిపారు. ఇందులో 6200 ఇళ్లకు ముగ్గులు పోయగా 4,848 ఇళ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయి. 1203 ఇళ్లు పూర్తయ్యాయి.

ఫ ఇందిరమ్మ ఇళ్లకు పీఎంజీఏవై అనుసంధానం..

ఇందిరమ్మ ఇళ్లకు గ్రామీణ ఉపాధిహామీ పథకం, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, పీఎం గ్రామీణ్‌ ఆవాస్‌ యోజన, పీఎం పట్టణ ఆవాస్‌ యోజన పథకాలను అనుసంధా నం చేశారు. వాటి ద్వారా ఒక్కో ఇంటికి ఒక లక్షా 60 వేల రూపాయలు సమకూరితే, రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల 40 వేల రూపాయల బిల్లులను మూడు దశల్లో చెల్లిస్తు న్నది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించుకునే ఇందిరమ్మ ఇళ్లకు ఒక్కో ఇంటికి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాఽధి హామీ పథకం ద్వారా 90 పని దినాలను కల్పించింది. ఈపథకం ద్వారా 90 రోజులకుగాను ఇందిరమ్మ ఇం టికి 40 వేల రూపాయలు, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మా ణానికి స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా 12 వేల రూపా యలు చెల్లిస్తున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ్‌ ఆవాస్‌ యోజన పథకం ద్వారా లక్షా 20 వేలు, పట్టణ ప్రాం తాల్లో పట్టణ ఆవాస్‌ యోజన కింద లక్షా 48 వేల రూపాయలు చెల్లించాలి. కానీ ఆ బిల్లుల కోసం మూడు మాసాలుగా జిల్లాలో 1219 మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.

ఫ జిల్లాలో 1218 ఇళ్లు పూర్తి..

జిల్లాలో ఇప్పటి వరకు 1218 ఇళ్ల నిర్మాణాలు పూర్త య్యాయి. ధర్మారం మండలంలో 104 ఇళ్లు, కమాన్‌పూర్‌ మండలంలో 27, ఎలిగేడులో 64, జూలపల్లిలో 84, ఓదెలలో 210, పెద్దపల్లిలో 149, కాల్వశ్రీరాంపూర్‌లో 79 ఇళ్లు, సుల్తానాబాద్‌లో 174, అంతర్గాంలో 101 ఇళ్లు, పాలకుర్తిలో 79 ఇళ్లు, కమాన్‌పూర్‌ మండలంలో 27 ఇళ్లు, మంథని మండలంలో 67, రామగిరి మండలంలో 53 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో ఒక్కో లబ్ధి దారుడికి లక్షా 20 వేల నుంచి లక్షా 60 వేల రూపా యల వరకు వరకు బిల్లులు రావాల్సి ఉన్నాయి. చాలా మంది లబ్ధిదారులు గృహ ప్రవేశాలు కూడా చేశారు. ఇళ్ల నిర్మాణాల కోసం అప్పులు తీసుక వచ్చామని, బిల్లులు రాకపోవడంతో వడ్డీల భారం పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల కోసం లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి తమ వాటా నిధులను విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ విషయమై ఆంధ్రజ్యోతి హౌసింగ్‌ పీడీ రాజేశ్వర్‌ను వివరణ కోరగా, ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నుంచి రావాల్సిన బిల్లులు వస్తున్నాయని, పీఎంజీఏవై, పీఎంపీఏవై నుంచి రావాల్సిన బిల్లులు విడుదల కావాల్సి ఉన్నాయని తెలిపారు.

ఫ చివరి విడత బిల్లు రాలేదు..

- దయ్యాల సుమలత, శాయంపేట

మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నీడ కల్పించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన లక్షా 60 వేల రూపాయల బిల్లు ఇంకా రాలేదు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లు ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూశాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బెంగ తీరింది. 3 లక్షల 40 వేల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా చెల్లించింది. కేంద్రం చెల్లించాల్సిన లక్షా 60 వేల బిల్లు కోసం ఎదురు చూస్తున్నాం. వడ్డీల భారం మోయలేక పోతున్నాం. వెంటనే కేంద్రం స్పందించి బిల్లులు విడుదల చేయాలి.

Updated Date - Jun 26 , 2026 | 01:01 AM