నోటీసులు అందుకున్న ఓటర్లు గుర్తింపు కార్డు సమర్పించాలి..
ABN , Publish Date - Sep 13 , 2026 | 01:08 AM
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసారిగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
తంగళ్లపల్లి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసారిగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్‌ఐ ఆర్) ప్రక్రియలో భాగంగా తంగళ్లపల్లి మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో 185 నుంచి 191 వరకు ఉన్న పోలీంగ్ బూత్‌లలో బీఎల్‌ఏ సమక్షంలో బూత్ లెవెల్ అధికారులు చేపడుతున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును నిర్ధారించుకునేందుకు ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులను సమర్పించాలన్నారు. 1అక్టోబరు 2026 వరకు 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులు ఎంత మంది ఓటు హక్కు కోసం చేసిన దరఖాస్తుల వివరాలతో పాటు, నో మ్యాపింగ్ ఓటర్లు, అనామలీస్ ఓటర్లు వివరాలను ఆరా తీశారు. మండలంలో ఉన్న అన్ని పోలిం గ్ బూత్‌ల పరిధిలో 9712 అనామలీస్ ఓటర్లు ఉన్నారని అధికారులు తెలి పారు. క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులతో పాటు సంబంధిత బీఎల్‌ఏలు నోటీ సులు అందిన ఓటర్లకు అవగాహన కల్పించి, తమ ధృవీకరణ పత్రాలు సమర్పించేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవర ణ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీధర్ ఉన్నారు.