కాంగ్రెస్, బీజేపీలకు ఓటర్ల తీర్పు గుణపాఠం..
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:26 AM
కాంగ్రెస్, బీజేపీ పార్టీల కు మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల పట్టణ ఓటర్ల తీర్పు గుణపాఠం కా నుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్, బీజేపీ పార్టీల కు మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల పట్టణ ఓటర్ల తీర్పు గుణపాఠం కా నుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. గురువా రం జిల్లా కేంద్రం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అధికారం పెట్టు కొని ప్రజలను ప్రలోభపెట్టి దౌర్జన్యం చెలాయిస్తూ బీఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్ల ఇళ్లపై దాడులు చేయించారని ఆరోపించారు. సిరిసిల్ల వస్త్ర వ్యాపారులను, ఆసాములను బెదిరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయిం చాలని లేకుంటే ఆర్డర్లను బంద్ చేయిస్తామని ప్రభుత్వం నుంచి రావా ల్సిన బకాయిలను రాకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడిన సిరిసి ల్ల పట్టణ ప్రజలు లౌక్యంగా ఆలోచన చేసి మంచి సానుకూల నిర్ణయ మే తీసుకున్నారని భావిస్తున్నామన్నారు. మరో 24గంటలు గడిస్తే కాం గ్రెస్ చేసిన మోసపూరిత హామీలు, బెదిరింపులు ఆ పార్టీకి చెంపపె ట్టుగా మారబోతుందని విమర్శించారు. బీజేపీ నుంచి వచ్చి మీ టింగ్ పెట్టిపోయిన వ్యక్తి దేవుళ్ల పేరి చెప్పి ప్రజల మభ్య పెట్టా డనికి ప్రయత్నించారన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం జరుగుతుందో తెలియదు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఎలా ఆదుకో వాలి ఎలా ముందుకు తీసుకెళాలో తెలియని వ్యక్తి అంటూ విమ ర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో జిల్లా, సిరిసిల్ల పట్టణా నికి ఏం చేయాలో కూడా తెలియని నాయకుడు ఇక్కడికి వచ్చి అడ్డదిడ్డం మాట్లాడి పోయాడని ఆరోపించారు. కేటీఆర్ నాయకత్వం సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి విశ్వాసంగా ప్రజలు గులాబీ సేనకే పట్టం కట్టబోతున్నారన్నారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పట్టణంను ఎంతో అభి వృద్ధి చేశారన్నారు. పట్టణ అభివృద్ధి జరగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్ రావా లని 39 మంది బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల పక్షాణ నిలిచారన్నారు. రేప టి కేటీఆర్ గెలుపునకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపుని చ్చారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగం పంచుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్య దర్శి గూడూరి ప్రవీన్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రాష్ట్ర సీనియర్ నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణ నాయకులు సత్తార్, రవి, శంకర్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.