ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ..
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:59 PM
ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
తంగళ్లపల్లి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల అధి కారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి పోలీంగ్ కేంద్రంలో 15,16 తేదిల్లో ప్రత్యేక శిబిరాలు కొన సాగుతుండగా గురువారం తంగళ్లపల్లి మండ లం బద్దెనపలిల్ల జడ్పీ ఉన్నత పాఠశాలలోని ప్రత్యేక పోలీంగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలిం చారు. ఫారం6 ద్వారా ఎన్ని దరఖాస్తులు వచ్చా యని ఆరా తీయగా మొత్తం 12 దరఖాస్తులు వచ్చినట్లు బూత్ లెవల్ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఓటర్ నమోదు కోసం వ చ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు కొనసాగుతున్నాయన్నారు. మొదటిసా రి ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే యువత తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఓటర్ల బాజితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ఫారం 6 ద్వారా దర ఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి ఓటుహక్కు పునాదిలాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్బాబు, ఇన్చార్జి తహసీల్దార్ మురళి,సర్పంచ్ చిలువేరి లావణ్యచిరంజీవి తదితరులు పాల్గొన్నారు.