ఓటర్ల మ్యాపింగ్‌ను వేగంగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:50 PM
ఎస్‌ఐఆర్ 2002 జాబితాతో 2025 ఓటర్ల జాబితా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నిక ల సంఘం సీఈవో సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్ 2002 జాబితాతో 2025 ఓటర్ల జాబితా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నిక ల సంఘం సీఈవో సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ లో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్,ఓటర్ల జాబితా 2025పై ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈవో సుద ర్శన్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈవో సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఎస్‌ఐ ఆర్ ఓటరు జాబితా మ్యాపింగ్ ఇప్పటివరకు కేవలం 41 శాతం మాత్రమే చేయడం జరిగిందని, రాబోయే15 రోజు ల్లో కనీసం 70 శాతం మ్యాపింగ్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఐఆర్ 2002ను ఎస్‌ఎస్‌ఆ ర్ 2025 లింకేజీ ప్రక్రియలు బూత్‌స్థాయి అధికారుల సహకారం తీసు కొని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి బూత్ స్థాయి అధికారి రోజుకు 30 ఎంట్రీలు టార్గెట్‌గా చేసే విధంగా చర్యలు తీసుకో వాలన్నారు. ఎస్‌ఐఆర్ 2002ను ఎస్‌ఐఆర్ 2025తో లింకేజీ ప్రక్రియ, అదేవిధంగా 2002 ఓట్లతో కుటుంబ సభ్యుల లింకేజీ ప్రక్రియ పూర్తిని వేగవంతంగా అధికారులు పూర్తి చేయించాలన్నారు. ఎస్‌ఐఆర్ జాబితా రూప కల్పన అధికారికంగా ప్రారంభం కాగానే అవసరమైన మేర ఎన్యుమరేటరీ ఫారాలను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రింట్ తీసుకుని సంబంధిత పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేయాలన్నారు. ప్రతి ఇంటికి రెండు ఫారాల చోప్పున బి.ఎల్.వో దగ్గర అందుబాటులో పెట్టాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిట ర్నింగ్ అధికారి, ఏఈఆర్‌వో, డిప్యూటీతహసీల్దార్‌లు, బీఎల్‌వోలు, సూప ర్‌వైజర్‌లతో నిత్యం సమావేశాలు నిర్వహించాలని, ప్రతిరోజు లక్ష్యా లను నిర్దేశించుకోని ఎస్‌ఐఆర్ చేపట్టేలా కార్యాచరణ తయారుచేయాల ని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.