Share News

తప్పుల తడకగా ఓటరు జాబితా

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:30 AM

ధర్మపురి పట్టణంలో గల పలు వార్డుల్లో ఓటరు జాబితాలో తప్పుల తడకగా ఉందని, అనేక మంది ఓటరుల పేర్లు గల్లంతు అయ్యాయని డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.

తప్పుల తడకగా ఓటరు జాబితా
మాట్లాడుతున్న డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి

-డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి

ధర్మపురి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి పట్టణంలో గల పలు వార్డుల్లో ఓటరు జాబితాలో తప్పుల తడకగా ఉందని, అనేక మంది ఓటరుల పేర్లు గల్లంతు అయ్యాయని డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ధర్మపురి పట్టణంలో తన స్వగృహంలో ధర్మపురి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, బీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ అయ్యోరు రాజేష్‌కుమార్‌తో కలిసి బుధవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఓటరు లిస్ట్‌లో తప్పులను సవరించాలని ఆయన కోరారు. గతంలో బీఆర్‌ఎస్‌ ఆఽధ్వర్యంలో మున్సిపల్‌ కమీషనర్‌ మామిళ్ల శ్రీనివాస్‌రావుకు వినతిపత్రం సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు. మున్సిపల్‌ కమీషనర్‌కు ఏమాత్రం అవగాహన లేకుండా తన ఇష్టం వచ్చిన రీతిలో ఓటరు జాబితా తయారు చేయించి, కాంగ్రెస్‌ నాయకులకు వత్తాసు పలికి డని ఆయన ఆరోపించారు.

మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తించకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికే పరిమితం అయ్యాడని ఆయన ఆరోపించారు. ఒక దినపత్రిక విలేకరి కుటుంబ సభ్యుల ఓట్లు మొత్తం గల్లంతయ్యాయని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ధర్మపురి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, బీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ అయ్యోరు రాజేష్‌కుమార్‌, పట్టణ కన్వీనర్‌ బండారి రంజిత్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ మాజీ అధ్యక్షులు స్తంభంకాడి మహేష్‌, పెరుమాల్ల ఎల్లాగౌడ్‌, ఒడ్నాల మల్లేశం, చిలువేరి శ్యాంసుందర్‌, సంగి శేఖర్‌, మాజీ కౌన్సిలర్లు గుర్రాల సుధాకర్‌, తరాల్ల కార్తీక్‌, కో ఆప్షన్‌ మాజీ మెంబర్‌ సయ్యద్‌ ఆసిప్‌, చుక్క రవి, అనంతుల లక్ష్మణ్‌, చీర్నేని నర్సయ్య, జెట్టి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 15 , 2026 | 12:30 AM