రుజువు ఉంటేనే ఓటు
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:57 AM
సర్-2026 ప్రక్రియలో భాగంగా మృతులు, డబుల్ ఓట్లు, చిరునామా లేని, వలస వెళ్లిన ఓటర్లను తొలగించి, ఈనెల 17న ముసాయిదా ఓటర్ జాబితాను వెల్లడించారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సర్-2026 ప్రక్రియలో భాగంగా మృతులు, డబుల్ ఓట్లు, చిరునామా లేని, వలస వెళ్లిన ఓటర్లను తొలగించి, ఈనెల 17న ముసాయిదా ఓటర్ జాబితాను వెల్లడించారు. అక్టోబరు 19న తుది ఓటర్ జాబితా వెల్లడిస్తారు. ఓటర్ జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(సర్)లో నో-మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లకు నోటీసులు ఇస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలామంది ఓటర్ల వివరాలు 2002 ఓటర్ జాబితాకు అనుగుణంగా మ్యాపింగ్ కాలేదు. జాబితాలో పేర్లు నమోదు తప్పుగా ఉండడం, ఇంటిపేరు, చిరునామా లోపాలు ఉండడంతో వారికి నోటీసులు ఇచ్చి ఆధారాలు సేకరిస్తారు. ఎన్నికల కమిషన్ సూచించిన ధ్రువపత్రాలు తగు రుజువుగా సమర్పిస్తేనే తుది ఓటర్ జాబితాలో ఓటరుగా నమోదవుతారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే వెల్లడైన ముసాయిదా ఓటర్ జాబితా ప్రకారం 4.17 లక్షల మంది ఓటర్లు ఉండగా 58567మంది ఓట్లు తొలగిపోయాయి. తొలగిన ఓట్ల శాతం 12.31 శాతంగా ఉంది.
జిల్లాలో నోటీసుల పంపిణీ..
జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ శాసనసభ నియోజకవర్గంలో 2002 ఓటర్ల జాబితాకు మ్యాపింగ్ కాకుండా, పేర్లు తప్పుగా నమోదు కావడం ఇతర పొరపాట్లు ఉన్న వారికి అనామలిస్ నోటీసులను పంపిణీ చేస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో 83 వేల 837 మందికి నోటీసులు జారీ చేశారు. ఇందులో వేములవాడ నియోజకవర్గంలో 30,559 మంది, సిరిసిల్ల నియోజకవర్గంలో 53,278 మందికి నోటీసులు అందిస్తున్నారు. కొంతమంది పెళ్లి అయి అత్తవారింటి వద్దనే ఎన్యూమరేషన్ ఇచ్చారు. కొంతమంది శాశ్వతంగా వేరే ప్రాంతానికి వలస వెళ్లడంతో అక్కడే ఓటును ఎంచుకున్నారు. కొంతమంది అవగాహన లేకపోవడంతో ఎన్యూమరేషన్ ఫారాలను ఇవ్వలేదు. ఇలా వివిధ కారణాలతో నో మ్యాపింగ్ కాని వారికి నోటీసులు ఇస్తున్నారు. బీఎల్‌వో, బీఎల్‌ఏలు నోటీసులను ఓటర్లకు అందిస్తున్నారు. నోటీసులు పొందినవారు ఎన్నికల కమిషన్ సూచించిన 12రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒకటి రుజువుగా అందించాల్సి ఉంటుంది. చాలామందికి నో మ్యాపింగ్ అనేదానిపై కొంత అస్పష్టత కూడా ఉంది. ఎన్యూమరేషన్ పారాలను నింపి బీఎల్‌వోలకు అందించకపోవడం వల్ల కొందరి ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ కాలేదు. ఇలా ఫారాలను వెనక్కి ఇవ్వని ఓటర్లను నో మ్యాపింగ్ ఓటర్లుగా అంటారు. ప్రకటించిన ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు ఉండి పేర్లలో అక్షర దోషాలు, వయస్సులో తేడా, తండ్రి, కొడుకు మధ్య ఉండాల్సిన వయస్సులో తేడా, పుట్టిన తేదీల్లో తేడాలు ఉన్న ఓటర్లను అనామలిస్‌లు కేటగిరీ కింద సూచిస్తారు. 2002 ఓటర్ జాబితాలో ఓటర్ పేరు అక్షరం తేడాతో నమోదయి ఉన్న ఓటరు ఒక్కరే అయినప్పటికీ రెండు పేర్లు వేరువేరుగా ఉండడంతో వెబ్‌సైట్ స్వీకరించలేదు. ఇలాంటి వాటిని అనామలిస్ కింద నోటీసు ఇచ్చి సరిచేస్తారు. ఫారం-6 డిక్లరేషన్‌ను ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 16 వరకు కొనసాగిస్తారు. నోటీసులు, రీహియరింగ్, క్లెయిమ్స్ సంబంధించిన ప్రక్రియ సెప్టెంబరు 20 వరకు కొనసాగుతుంది. ఇందుకోసం గ్రామసభలు కూడా నిర్వహిస్తారు. ఓటర్లకు ఓటు హక్కు కలిగించే విధంగా అక్టోబరు 15 వరకు అభ్యంతరాలను పరిష్కరించి తుది ఓటర్ జాబితాను అక్టోబరు 19న వెల్లడిస్తారు.
జిల్లాలో ఇదీ ఓటర్ల లెక్క..
జిల్లాలో ప్రధానంగా ఉన్న సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రకారం రెండు నియోజకవర్గాల్లో 417,303 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,02,580 మంది, మహిళలు 2,14,526 మంది ఉన్నారు. ఇతరులు 21 మంది ఉండగా, సర్వీస్ ఓటర్లలో పురుషులు 169 మంది, మహిళలు ఏడు మంది ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో 2,02,386 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 97,539 మంది, మహిళలు 1,04,766 మంది ఉన్నారు. ఇతరులు 18మంది ఉండగా, సర్వీస్ ఓటర్లలో పురుషులు60 మంది, మహిళలు ముగ్గురు ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 2,14,917మంది ఉండగా, పురుషులు 1,05,041 మంది, మహిళలు 1,09,760 మంది ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉండగా, సర్వీస్ ఓటర్లలో పురుషులు 109 మంది, మహిళలు నలుగురు ఉన్నారు.రెండు సెగ్మెంట్లలో డ్రాఫ్ట్ నోటిపికేషన్ ప్రకారం 4,17,303 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,02,580 మంది, మహిళలు 2,14,526 మంది, థర్డ్ జెండర్‌లు 21 మంది ఉన్నారు. వారిలో 11,953 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 2,14,917మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,05,041 మంది, మహిళలు 1,09,764 మంది, థర్డ్ జెండర్‌లు నలుగురు ఉన్నారు. వీరిలో 4,723 మమహిళలు అధికంగా ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో 2,02,386 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 97,599 మంది, మహిళలు 1,04,769 మంది, థర్డ్ జెండర్‌లు ముగ్గురు ఉన్నారు. వీరిలో 7,230 మహిళలు అధికంగా ఉన్నారు.
జిల్లాలో 58,567 మంది ఓట్లు తొలగింపు
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ‘సర్’ ప్రక్రియ ప్రారంభానికి ముందు 4,75,694 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి అడ్మిషన్ ఫారాలు పంపిణీ చేసి తిరిగి డిజిటలైజేషన్‌లో 4,17,127 మంది ఓటర్లు అర్హులుగా గుర్తించి ముసాయిదా ఓటర్ జాబితాను వెల్లడించారు. దీని ప్రకారం రెండు నియోజకవర్గాల్లో 58,567 మంది ఓటర్లు తొలగిపోయారు. ఇందులో 12,791 మంది మృతిచెందిన వారు ఉన్నారు. జిల్లా నుంచి శాశ్వతంగా వెళ్లిపోయినవారు 25,926 మంది, డబుల్ ఓటర్లు 10వేల 62 మంది, ఆచూకీ దొరికిన ఓటర్లు 9,098 మంది ఉన్నారు. ఇందులో సిరిసిల్ల నియోజకవర్గంలో 2,14,917 మంది ఓటర్ల ఉన్నారు. తొలగించిన ఓటర్లలో మృతులు 6,032 మంది ఉన్నారు. శాశ్వతంగా వెళ్లిపోయినవారు 15,452 మంది, డబుల్ ఓటర్లు 5,017మంది, దొరకని ఓటర్లు 4,997 మంది ఉన్నారు, ఇతరుల జాబితాలో 260 మంది ఓటర్లను చేర్చారు. వేములవాడ నియోజకవర్గంలో 2,02,386 మంది ఓటర్లు ఉన్నారు. తొలగించిన ఓటర్లలో మృతులు 6,759 మంది ఉన్నారు. శాశ్వతంగా వెళ్లిపోయిన వారు 10,474 మంది, డబుల్ ఓటర్లు 5,045 మంది, దొరకని ఓటర్లు 4,101 మంది ఉన్నారు. ఇతరుల జాబితాలో 430 మంది ఓటర్లను చేర్చారు. తొలగించిన ఓటర్లలో మృతులు 12,791 మంది ఉంటే శాశ్వతంగా వలస వెళ్లినవారు 25,926 మంది ఉన్నారు. వలస ఓటర్లలో సిరిసిల్ల నియోజకవర్గంలో 10,474 మంది ఓటర్లు, వేములవాడ నియోజకవర్గంలో 15,452 మంది ఉన్నారు. ఇందులో ప్రధానంగా శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల జాబితాలో సిరిసిల్ల నుంచి 8,153 మంది, వేములవాడలో 3,252 మంది ఉన్నారు. వీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లల చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాలరీత్యా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో స్థిరపడ్డవారే తిరిగి తమ సొంత ఊర్లో ఓట్లు ఉండే విధంగా మొగ్గు చూపారని భావిస్తున్నారు. మరికొంతమంది హైదరాబాద్ నగరంలో పూర్తిస్థాయిలో స్థిరపడి అక్కడే ఉండిపోవడంతో జిల్లా నుంచి ఓట్లు బదిలీ చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.
వేములవాడ నియోజకవర్గంలో నో మ్యాపింగ్, అనామలిస్ నోటీసుల లెక్క
మండలం నోటీసులు
మేడిపల్లి 4893
భీమారం 3545
కథలాపూర్ 4709
రుద్రంగి 1997
చందుర్తి 1943
వేములవాడ రూరల్ 1217
వేములవాడ మున్సిపల్ 3616
వేములవాడ 3580
కోనరావుపేట 5059
మొత్తం 30559
సిరిసిల్ల నియోజకవర్గంలో నో మ్యాపింగ్, అనామలిస్ నోటీసుల లెక్క
మండలం నోటీసులు
వీర్నపల్లి 2150
ఎల్లారెడ్డిపేట 9361
గంభీరావుపేట 7895
సిరిసిల్ల 7849
సిరిసిల్ల మున్సిపల్ 9306
తంగళ్ళపల్లి 9712
ముస్తాబాద్ 7005
మొత్తం 532778
సిరిసిల్ల సెగ్మెంట్ లో ఓటర్లు, తొలగింపు వివరాలు
మండలం తొలిగిన ఓట్లు మృతులు శాశ్వతంగావెళ్లిన డబుల్ ఓటర్లు అడ్రస్ దొరకనివారు
వీర్నపల్లి 943 150 590 191 10
ఎల్లారెడ్డిపేట 4602 998 1797 780 1002
గంభీరావుపేట 2760 669 959 757 271
సిరిసిల్ల 14456 2869 8153 1908 1462
తంగళ్ళపల్లి 5461 759 2343 617 1680
ముస్తాబాద్ 3536 587 1610 764 572
మొత్తం 31758 6032 15452 5017 4997
వేములవాడ సెగ్మెంట్ లో ఓటర్లు, తొలగింపు వివరాలు
మండలం తొలిగిన ఓట్లు మృతులు శాశ్వతంగావెళ్లిన డబుల్ ఓటర్లు అడ్రస్ దొరకని వారు
మేడిపల్లి 2375 726 1066 481 101
భీమారం 1813 615 694 405 88
కథలాపూర్ 4719 1771 1494 1369 85
రుద్రంగి 1278 236 521 476 45
చందుర్తి 3540 1005 1638 606 28
వేములవాడ రూరల్ 1588 520 729 312 26
వేములవాడ 9606 1516 3252 1064 88
కోనరావుపేట 1890 370 1080 332 42
మొత్తం 26809 6759 10474 5042 430