సేవా గుణం చూసి ఓటేయాలి
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:55 AM
కులం, మతం కూడు పెట్టదు.. మనిషి సేవాగుణం చూసి ఓటు వేయాలని, ఏ పార్టీ గెలిస్తే సిరిసిల్ల బాగుపడుతుంది.. కడుపు నింపే పనులు చేస్తుందో ఆలో చించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నా రు.
సిరిసిల్ల, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : కులం, మతం కూడు పెట్టదు.. మనిషి సేవాగుణం చూసి ఓటు వేయాలని, ఏ పార్టీ గెలిస్తే సిరిసిల్ల బాగుపడుతుంది.. కడుపు నింపే పనులు చేస్తుందో ఆలో చించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నా రు. శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరి ధిలోని 7వ వార్డులో ఎన్నికల ప్రచారం లో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహిం చారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ నిలబడ్డ వ్యక్తి మన కులం, చుట్ట మే కావచ్చు.. కానీ మనం వేసే ఓటు మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ రేవంత్‌రెడ్డికి బలం ఇచ్చినట్లు అవుతుందన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే తనకు బలాన్ని ఇచ్చిన ట్లు అవుతుందని, ఇచ్చిన హామీలు ఏమైనట్లు అని రేవంత్‌రెడ్డి గల్లపట్టి అడగవచ్చని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని సిరిసిల్ల ప్రజ లు ఓటు వేశారని, కానీ వేములవాడ మరికొన్ని చోట్ల కాంగ్రెస్ వాళ్ల మాటలకు ఆగమై కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు నిలబెట్టుకోకుండా మోసం చేసింన్నారు. దుబ్బాకలో కేసీఆర్ పద్మశాలి వాళ్ల ఇంట్లో ఉండి చదువుకున్నాడని, కార్మికుడు మ గ్గం నేస్తే, ఆయన భార్య బీడీలు చుట్టేదన్నారు. బీడీలు చుట్టే మ హిళకు కలిగే ఇ బ్బందులు కేసీఆర్ కు తెలుసు కాబట్టి ఎవరూ అడగకపో యినా కార్మికులపై ఉన్న ఆర్తితో రూ.2 వేల పింఛన్ 4.50లక్షల మందికి ఇచ్చారని అన్నారు. నేత కార్మికులకు బతుకునివ్వాలని బతుకమ్మ చీరల ద్వారా రూ.16వేల నుంచి రూ.20వేల వరకు సంపాదించుకొని బాగుండాలని ఆర్డర్ ఇచ్చారన్నారు. నేతన్నల ఆత్మహత్యలు లేకుండా, మరమగ్గాలు నడవాలంటే సిరిసిల్లలో గులాబీ జెండా ఎగరాలన్నారు. కేసీఆర్ సిరిసిల్ల జిల్లా ఇచ్చి కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులను తీసుకు వచ్చారని, రేవంత్‌రెడ్డి జిల్లాను తీసివేయడానికి చూస్తున్నాడన్నారు. కాంగ్రెస్ ఓడిపోతేనే సిరిసి ల్ల జిల్లా ఉంటుందన్నారు. కాంగ్రెస్ వాళ్లు రూ 4వేల పింఛన్, కల్యాణలక్ష్మిలో తులం బంగారం, మహిళకు రూ.2500, ఆడపడుచులకు స్కూటీ లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, జేఎన్టీయూ, వ్యవసాయ డిగ్రీ, పాలిటెక్నిక్ కళా శాలు ఇచ్చారమన్నారు. పద్మశాలీల కోసం రూ 25 కోట్ల విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని ఇవ్వ డంతో పాటు రూ.8కోట్లతో భవనాన్ని కట్టుకోమ ని ఇచ్చామన్నారు. మున్సిపల్‌ఎన్నికల్లో కాంగ్రెస్ తో పంచాయతీ ఉంటే సందెట్లో సడేమియా అన్నట్లుగా అక్షింతలు, దేవుని పేరు చెబుతూ ఓట్ల కోసం బీజేపీ వాళ్లు వస్తారన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాదు తొండి సంజయ్ జిల్లాకు పదిపైసలు పనిచేశాడా..ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్‌ఎస్ నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, అగ్గిరాములు, రజ ని, కేవిఎన్‌రెడ్డి, సిద్దం వేణు, విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.