Share News

భూసార పరీక్షలకు ముందుకు రాని వలంటీర్లు

ABN , Publish Date - Apr 12 , 2026 | 02:00 AM

భూమి సంరక్షణ.. భూసార పరీక్షల ఆవశ్య కతపై రైతులకు అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున వలంటీర్లను నియ మించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా ఎవరు కూడా ముందుకు రావడం లేదు.

భూసార పరీక్షలకు  ముందుకు రాని వలంటీర్లు

- ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురు

- ఈ నెల 20వ తేదీ వరకు నియమించాలని ఆదేశాలు

- కసరత్తు చేస్తున్న వ్యవసాయ శాఖ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

భూమి సంరక్షణ.. భూసార పరీక్షల ఆవశ్య కతపై రైతులకు అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున వలంటీర్లను నియ మించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా ఎవరు కూడా ముందుకు రావడం లేదు. వలం టీర్లుగా పని చేసే వారికి ఎలాంటి ప్రోత్సహ కాలు ప్రకటించకపోవడమే కారణంగా తెలుస్తున్నది. ఈనెల 20వ తేదీ వరకు ప్రక్రియ ముగించాలనే ఆదేశాలు ఉండగా, ఆ మేరకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది. కానీ ఎవరు ఆసక్తి చూపడం లేదు.

పంట భూముల భూసారాన్ని పరీక్షించి నేల ఆరోగ్య కార్డులను అందించేందుకు వలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయిచింది. ఆ మేరకు వ్యవ సాయ శాఖ అధికారులు నియామకాలు చేప ట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 2 లక్షల 80 వేల ఎకరాల పైచిలుకు సాగు భూములు ఉన్నాయి. వీటిల్లో అత్యధికంగా వరి, పత్తి పం టలు పండిస్తుండగా, ఆ తర్వాత మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 207 రెవెన్యూ గ్రామాలు ఉం డగా, గ్రామానికి ముగ్గురు చొప్పున 621 మంది వలంటీర్లను నియమించాల్సి ఉంది. ఒక్కో రెవెన్యూ గ్రామం లో భూసార పరీక్షల కోసం 40 శాంపిళ్లు, మొత్తం 8140 శాంపిళ్లు సేకరించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన వలంటీర్లకు కృషి విజ్ఞాన కేం ద్రాల శాస్త్రవేత్తలు ఒక రోజు శిక్షణ ఇవ్వను న్నారు. 20వ తేదీ వరకు వలంటీర్ల నియామకం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నెల మూడో వారం నుంచి వరి కోతలు ఆరంభమై మే నెల రెండో వారంలో పూర్తి కానున్నాయి. కోతలు అయిపోయిన తర్వాత భూసారాన్ని పరీక్షించేం దుకు మట్టి నమూనాలను సేకరించాల్సి ఉంటుంది.

ఫ వలంటీర్ల విధులు ఇలా..

వలంటీర్ల నియామకానికి కనీసం పదో తరగతి పాసై ఉండాలని, వ్యవసాయంపై అవగాహన ఉండి, భూసార సంరక్షణ విషయా లపై ఆసక్తి ఉన్న వారిని నియమించనున్నారు. వారు గ్రామాల్లో రైతులకు భూసార సంరక్షణ, పరీక్షలపైనా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అవగాహన కల్పించాలి. భూసార పరీక్షలతో లాభాలు వివరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రామాల్లో రసాయనిక ఎరువుులు అధికంగా వాడడం, సంప్రదాయ ఎరువులకు దూరంగా ఉండడం, భూసారం తగ్గి ఆశించిన మేరకు పంట దిగుబడులు రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. అలాగే రైతులు సాగు చేసిన వరి, పత్తి, మొక్కజొన్న పంటల వ్యర్థాలు తగల బెట్టడం వల్ల భూసార నష్టంపై అవగాహన కల్పించాల్సి ఉంది. భూసార పరీక్షలతో భూము ల్లో ఉన్న పోషకాలు, లోపాలు గుర్తించి అందుకు అనుగుణంగా పండించాల్సిన పంటలపై రైతు లకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. నేలల్లోని చౌడు సమస్యలు రసాయన ఎరువు లపై ఖర్చు తగ్గించడం, సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగం వంటి విషయాలపై వలంటీర్లు అవగాహన పెంచుకుని రైతులకు తెలియజేయాల్సి ఉంటుంది. రైతులను ప్రోత్స హించి తమ భూములకు భూసార పరీక్షలు నిర్వహించి తద్వారా నేల ఆరోగ్య కార్డులు అందించే విషయంలో వలంటీర్లు రైతులకు, వ్యవసాయశాఖ అధికారులకు అనుసంధానంగా వ్యవహరించనున్నారు.

ఫ ప్రోత్సాహకాలు ఇస్తేనే ముందుకు..

భూసారాన్ని పరిరక్షించేందుకు యేటా భూసార పరీక్షలు నిర్వహించి తదనుగుణంగా ఎరువులను వాడేందుకు నియమించనున్న వలంటీర్లకు ప్రోత్సాహకాలు ఇస్తేనే ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. పశుసంవర్ధక శాఖలో గోపాలమిత్రలకు ప్రోత్సహకాలు ఇచ్చినట్లుగా భూసార సంరక్షణ వలంటీర్లకు కూడా ప్రొత్సహ కాలు ఇస్తే వారికి ఉపాధి లభించినట్లవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందు కోసం రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కొంత పరీక్ష రుసుములు నిర్ణయిస్తే నిరుద్యోగ యువకులు కూడా భూసార పరీక్షల నిర్వహణపై అవగాహన పెంచుకుని రైతులకు బాసటగా నిలిచే అవకాశం ఉంది. దీనిపై ప్రభు త్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోనున్నది.

Updated Date - Apr 12 , 2026 | 02:00 AM