Share News

విఠల.. విఠల.. పాండురంగా..

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:12 AM

విఠల... విఠల.. పాండురంగా.. అంటూ శివభక్త మార్కండేయ స్వామి నామస్మరణతో స్వామివారి శోభాయాత్ర కనుల పండుగగా సాగింది.

విఠల.. విఠల.. పాండురంగా..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

విఠల... విఠల.. పాండురంగా.. అంటూ శివభక్త మార్కండేయ స్వామి నామస్మరణతో స్వామివారి శోభాయాత్ర కనుల పండుగగా సాగింది. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీశివభక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్స వాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవస్థానంలో స్వామివారి మహాయజ్ఞం నిర్వహించారు. సాయంత్రం పద్మశాలీలు, మహిళలు, విద్యార్థుల కోలాట నృత్యాలు జనసందోహాం మధ్య వైభవోపేతంగా మార్కండేయ స్వామి శోభాయాత్ర నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై మార్కండేయ స్వామి ఉత్సవ విగ్రహంతో మార్కండేయ దేవస్థానం నుంచి బయలుదేరిన యా త్ర గాంధీచౌక్‌, అంబేద్కర్‌ చౌరస్తా, చేనేత చౌక్‌, పెద్దబజార్‌ మీదుగా వెంకటేశ్వర స్వామి దేవాలయం మీదుగా కొనసాగింది. శోభాయాత్రకు వేలాదిగా తరలివచ్చిన పద్మశాలీలు, మార్కండేయ స్వామి భక్తులు అడు గడుగునా నృత్యాలు చేస్తూ మార్కండేయ నామ స్మరణ చేశారు. విద్యా ర్థులు కోలాటం, నృత్యాలు చేశారు. శోభాయాత్రలో పద్మబ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రలో గాంధీ, అంబేద్కర్‌, నేత న్న విగ్రహాలకు పూలమాలలు వేశారు. జయంతి ఉత్సవాల్లో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి కే తారకరామారావు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్‌, టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌ రావు, పవర్‌లూం టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, సిరిసిల్ల మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ రాపెల్లి లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షులు మోర రవి, గాజుల బాలయ్య, కోశాధి కారి యెల్లే శ్రీనివాస్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అడెపు రవీందర్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కాంగ్రెస్‌ జిల్లా అధ్య క్షుడు సంగీతం శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా ఆధ్యక్షుడు తోట ఆగయ్య, టౌన్‌ క్లబ్‌ ఆధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, పద్మశాలి సంఘం ప్రతిని ధులు బొల్లి రామ్మోహన్‌, మ్యాన రవి, యెల్లే లక్ష్మీనారాయణ, పూర్లచం దర్‌, వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు అడేపు భాస్కర్‌, కార్యదర్శి రవి, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్‌, పద్మశాలి మహిళ సంఘం అధ్యక్షురాలు కాముని వనిత, గుజ్జెతార, దార్నం అరుణ, పత్తిపాక పద్మ, మాజీ అధ్యక్షుడు గోలి వెంకటరమణ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ప్రతినిధులు, మున్సిపల్‌ కౌన్సిల ర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న మార్కండేయ స్వామి నృత్య రూపకం

మార్కండేయ స్వామి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. సిరిసిల్ల గాంధీ చౌక్‌ వద్ద మార్కండేయ స్వామి శోభాయాత్రలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆడెపు రవీందర్‌ శివుడి వేషధార ణ, ఇతరులు యముడు, మార్కండేయులు వేషధారణలతో నృత్య రూపకా న్ని ప్రదర్శించారు. వారిని ప్రభుత్వం విప్‌ ఆది శ్రీనివాస్‌, పట్టణ ప్రము ఖులు అభినందించారు.

సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి : విప్‌

కార్మిక, ధార్మిక క్షేత్రంలో మార్కండేయస్వామి జయంతి వేడుకలను సిరి సిల్లలో జరుపుకోవడం సంతోషకంగా ఉందని, సనాతన ధర్మాన్ని కాపాడు కుంటూ ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. సిరిసి ల్లలో మార్కండేయస్వామి శోభాయాత్రలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కల్యాణం జరగాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పండాలని, నేతన్నలకు చేతినిండా పని లభించాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు. పద్మశాలీలు ఉత్సవాలను వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

వస్త్ర పరిశ్రమ బాగుండాలి : కేటీఆర్‌

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాగుండాలని, సిరిసిల్ల అభివృద్ధి చెందాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ రాష్ట్ర ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారక రామారావు అన్నారు. మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా స్వామివారిని దర్శిం చుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. నేతన్న విగ్రహానికి పూలమాల వేసి పద్మశాలీలకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 22 , 2026 | 12:12 AM