Share News

భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనోత్సవాలు

ABN , Publish Date - Sep 18 , 2026 | 01:10 AM

వేములవాడ పట్టణంలో ఈనెల 23వ తేదిన నిర్వహించే నిమజ్జన వేడుకల ను భక్తిశ్రద్ధలతో చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనోత్సవాలు

వేములవాడ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): వేములవాడ పట్టణంలో ఈనెల 23వ తేదిన నిర్వహించే నిమజ్జన వేడుకల ను భక్తిశ్రద్ధలతో చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రాజన్న ఆలయ గుడి చెరువు వద్ద వినాయక నిమజ్జన వేడు కల కోసం మున్సిపల్‌, పోలీస్‌, రెవెన్యూ ఇతర శాఖల ఆధ్వ ర్యంలో చేస్తున్న ఏర్పాట్లను గురువారం కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బి. గితేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ పట్టణంలో మొత్తం 311 గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభ వంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్కరు అధికారులకు సహకరించాలని కోరా రు. అన్ని శాఖల అధికారులు సమన్వయం తో ముందుకు వెళ్లి, వేడుకలను విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావాలసిన, స్టేజ్‌, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు అగ్నిమాపక శాఖ అధికారులు సేవలు అం దించాలని, పారిశుధ్య పనులు చేయించాల ని, క్రేన్లు అందుబాటులో పెట్టాలని మున్సిప ల్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ తరహాలో గుడి చెరువు బండ్‌ పార్క్‌ను దాదాపు రూ.12కోట్లతో అద్భుతంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని, ఇటీవల మం త్రులు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. వారి వెంట మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, ఆర్డీవో కేఎస్‌బీ కుమా రి, డీఎస్పీ శ్రీనివాసులు, ఎమ్మార్వో జయంత్‌, కమిషనర్‌ లోకేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 01:10 AM